Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్ పూర్ణ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిందా..! 

అవును 2  చిత్రం  త‌రువాత   హీరోయిన్ పూర్ణ పెద్ద‌గా క‌నిపిచంలేదు.  ఈ హాట్ బ్యూటీ  ప్ర‌స్తుతం అర‌డ‌జ‌ను చిత్రాల‌తో   అభిమానుల్ని అల‌రించ‌డానికి సిద్దం అవుతుంది.  తెలుగులో రెండు చిత్రాలు..అలాగే త‌మిళ‌లో మూడు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా వున్నాయి.   ఇదిలా వుండగా కోలీవుడ్‌ డైరెక్టర్ మిస్కిన్‌ న్యూఫిల్మ్ ‘సవర కత్తి’లో కూడా పూర్ణ ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో ఓ క్యారెక్టర్ కోసం ఆరుగురు హీరోయిన్లని దర్శకుడు సంప్రదించాడట. అందరూ రిజెక్ట్ చేయడంతో చివరకు పూర్ణ ఓకే చెప్పేసింది.  […]

హీరోయిన్ పూర్ణ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిందా..! 
X

అవును 2 చిత్రం త‌రువాత హీరోయిన్ పూర్ణ పెద్ద‌గా క‌నిపిచంలేదు. ఈ హాట్ బ్యూటీ ప్ర‌స్తుతం అర‌డ‌జ‌ను చిత్రాల‌తో అభిమానుల్ని అల‌రించ‌డానికి సిద్దం అవుతుంది. తెలుగులో రెండు చిత్రాలు..అలాగే త‌మిళ‌లో మూడు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా వున్నాయి.
ఇదిలా వుండగా కోలీవుడ్‌ డైరెక్టర్ మిస్కిన్‌ న్యూఫిల్మ్ ‘సవర కత్తి’లో కూడా పూర్ణ ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో ఓ క్యారెక్టర్ కోసం ఆరుగురు హీరోయిన్లని దర్శకుడు సంప్రదించాడట. అందరూ రిజెక్ట్ చేయడంతో చివరకు పూర్ణ ఓకే చెప్పేసింది.

ఈ చిత్రంలో పూర్ణ రోల్ చేయాలంటే ధైర్యం కావాలని, సవాలుతో కూడినదని చెబుతున్నాడు. ఇంతకీ కేరళ బ్యూటీ చేస్తున్న ఆ క్యారెక్టర్ ఏంటో? అనేదానిపై తలోవిధంగా కోలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. దర్శకుడు మిస్కిన్.. ఇందులో విలన్ పాత్ర చేయబోతున్నాడు. ఇందుకోసం ఆయన 15 కిలోల బరువు తగ్గనున్నాడట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానుంది.

First Published:  21 July 2015 1:53 AM GMT
Next Story