Telugu Global
Others

పరకాల బలిపశువు కానున్నాడా ?

రాజమండ్రి పుష్కర ఘాట్ లో 29 మంది చనిపోయిన పాపం ఎవరి లెక్కలో వేయ్యాలో ఇప్పుడూ నిర్ణయమయిపోయిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. తొక్కిసలాట‌ జరగగానే, ఇలాంటివి మామూలే అన్నట్లు మీడియాలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే భక్తులు మృత్యువాత పడ్డ దృశ్యాలను 10టీవి ఛానల్ ఊహించని రీతిలో ప్రచారం చేయడంతో కలకలం రేగింది. మిగతా ఛానల్స్ కూడా ఆప్రమాద వార్త ప్ర్రాముఖ్యాన్ని గుర్తించక తప్పలేదు.  వెంటనే డ్యామేజ్ కంట్రోల్ కి రంగంలోకి దిగిన చంద్రబాబు, కంట్రోల్ రూమ్ కి […]

పరకాల బలిపశువు కానున్నాడా ?
X
రాజమండ్రి పుష్కర ఘాట్ లో 29 మంది చనిపోయిన పాపం ఎవరి లెక్కలో వేయ్యాలో ఇప్పుడూ నిర్ణయమయిపోయిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. తొక్కిసలాట‌ జరగగానే, ఇలాంటివి మామూలే అన్నట్లు మీడియాలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే భక్తులు మృత్యువాత పడ్డ దృశ్యాలను 10టీవి ఛానల్ ఊహించని రీతిలో ప్రచారం చేయడంతో కలకలం రేగింది. మిగతా ఛానల్స్ కూడా ఆప్రమాద వార్త ప్ర్రాముఖ్యాన్ని గుర్తించక తప్పలేదు.

వెంటనే డ్యామేజ్ కంట్రోల్ కి రంగంలోకి దిగిన చంద్రబాబు, కంట్రోల్ రూమ్ కి వెళ్ళి , ఘాట్ లు తిరిగి హడావుడి చేశాడు. కంట్రోల్ రూమ్ లో అనుభవజ్ఞులైన పోలీస్ అధికారి సూచనలు ఇస్తే ఉపయోగం ఉంటుంది, కాని చంద్రబాబు కంట్రోల్ రూమ్ కి వెళ్ళి ఏంచేస్తాడు ? కంట్రోల్ రూమ్ లో ఆయనకేం పని ? అని ఎవరు ప్రశ్నించలేదు…
జరిగిన దాన్ని జరిగినట్లుగా వార్త ఇస్తే ప్రజల దృష్టిలో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా నిలబడేవాడు. ఆయనను ఆ బాధ్యత‌ నుంచి తప్పించడానికి రంగంలోకి దిగిన మీడియా ఇలాంటి సందర్భాల్లో ఎక్కెడెక్కడ ఎంతమంది చనిపోయింది గణాంకాలు కుమ్మరించి వాటితో పోలిస్తే ఈ 29 మరణాలు పెద్దలెక్కలోనివి కానట్లు కొందరు, ఈ మరణాలు భక్తుల తెలివి తక్కువతనం వల్ల జరిగాయని మరి కొందరు, ఈ చావులకు పురాణ ప్రవచన కర్తలు బాధ్యత వహించాలని మరికొందరు మొత్తం కలసి చంద్రబాబుని తప్ప మిగిలిన వాళ్ళందరిని బాధ్యుల్ని చేసేశారు.
చంద్రబాబు అక్కడే ఉండి ఎంత కష్టపడుతున్నదీ పుంఖానుపుంఖంగా కధనాలు వండి వార్చి, ఇంత పెద్ద మహా కార్యక్రమంలో 29 మరణాలు పెద్దలెక్కలోవి కావనట్టు జనాన్ని నమ్మించే బాధ్యతను మీడియా భుజాన వేసుకుంది. అయితే తెలుగులో 3 నుండి 4 ఛానల్స్ మరియు 2,3 పత్రికలు అక్కడ‌ అసలేం జరిగిందో ప్రజలకు చెప్పాలనుకున్నా ఆ హోరు గాలిముందు వీళ్ళ గొంతు ప్రజలకు వినబడలేదు.
ఎవరు ఊహించని విధంగా టైమ్స్ నౌ అనే ఇంగ్లీష్ ఛానల్లో అర్నబ్ గోస్వామి టీడీపి తరపున చర్చలో పాల్గొన్న వాళ్ళను ఉతికి ఆరేసి చంద్రబాబుని ప్రధాన దోషిగా దేశం ముందు నిలబెట్టేసరికి తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి వెన్నుముక లాంటి మీడియాకి దిక్కుతోచలేదు.
ఘటన జరగగానే చంద్రబాబు న్యాయవిచారణకు ఆదేశించాడు. ఎవరెవరు బలిపశువులు అయ్యే అవకాశం ఉందో చూఛాయగా తెలిసింది. బలిపశువు అయ్యే అవకాశం ఉన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ దైర్యంచేసి తన ప్రాధమిక రిపోర్ట్ ని కేంద్రానికి పంపాడు.విచారణ తరువాత ఆ 29 మరణాలకు ప్రభుత్వ అధికారుల్ని ఎవర్ని బాధ్యులని చేసినా ప్రజల దృష్టిలో చంద్రబాబే దోషి. విఐపి ఘాట్ కి కాకుండ పుష్కర‌ ఘాట్ కి ఆయనెందుకు వెళ్ళాల్సి వచ్చింది ? అక్కడ మూడు గంటలెందుకు ఉండాల్సి వచ్చింది ? అని మనస్సు లో నిలదీస్తూనే ఉంటుంది. ప్రజల మనసుల్లోంచి అలాంటి అనుమానాన్ని తుడిచేసి మచ్చలేని చంద్రబాబుగా నిలబెట్టడానికి మీడియాలో ఒక వర్గం అసలు రహస్యం బయిటపెట్టింది.చంద్రబాబును వీవిఐపి ఘాట్ నుంచి పుష్కర‌ ఘాట్ కు బలవంతంగా తీసుకవెళ్ళింది పరకాల ప్రభాకరే అని వారంటున్నారు.
ప్రభాకర్ వల్లే అప్పుడు చిరంజీవి బదనాం అయ్యాడని, ఇప్పుడు చంద్రబాబు బదనాం అవుతున్నాడని సాక్ష్యాధారాలతో సహ మంత్రుల నోటినుంచి మీడియా కొత్తకధనాలు వినిపించడానికి రంగం సిద్ధం అయిందని రాజకీయ విశ్లేషకులు ఊహాగానాలు చేస్తున్నారు.

First Published:  20 July 2015 6:22 AM GMT
Next Story