Telugu Global
Others

ముడిపడిన అమెరికా-క్యూబా బంధాలు

అర శతాబ్దం నుంచి తెగి ఉన్న బంధాలను ముడి వేసుకున్నాయి అమెరికా, క్యూబా దేశాలు. 1961లో చెడిపోయిన ఈ రెండు దేశాల సంబంధాలు ఇపుడు పునరుద్దరణ జరగడంతో అమెరికాలో కొత్తగా ఏర్పాటైన క్యూబా ఎంబసీలో ఎరుపు, తెలుపు, నీలం రంగులతో కూడిన క్యూబా పతాకం రెపరెపలాడుతూ ఎగురుతోంది. అలాగే క్యూబాలో కూడా అమెరికా ఎంబసీ ఏర్పాటైంది. 1959 తర్వాత తొలిసారిగా 2014 ఏప్రిల్‌ 11న అమెరికా, క్యూబా అధ్యక్షులు పనామాలో కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఈ […]

అర శతాబ్దం నుంచి తెగి ఉన్న బంధాలను ముడి వేసుకున్నాయి అమెరికా, క్యూబా దేశాలు. 1961లో చెడిపోయిన ఈ రెండు దేశాల సంబంధాలు ఇపుడు పునరుద్దరణ జరగడంతో అమెరికాలో కొత్తగా ఏర్పాటైన క్యూబా ఎంబసీలో ఎరుపు, తెలుపు, నీలం రంగులతో కూడిన క్యూబా పతాకం రెపరెపలాడుతూ ఎగురుతోంది. అలాగే క్యూబాలో కూడా అమెరికా ఎంబసీ ఏర్పాటైంది. 1959 తర్వాత తొలిసారిగా 2014 ఏప్రిల్‌ 11న అమెరికా, క్యూబా అధ్యక్షులు పనామాలో కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే మే 29న తీవ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగిస్తూ అమెరికా మరో సకారాత్మక నిర్ణయం తీసుకుంది. ఇలా క్రమంగా ఇరుదేశాల సంబంధాలు బలపడి ఇప్పుడు నేరుగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్‌ కెర్రీ క్యూబా విదేశాంగ మంత్రి భేటీ అయ్యి చర్చలు జరిపే స్థాయి వరకు వచ్చింది. ఇలా పది నెలల కాలంలో రెండు దేశాల సంబంధాలు సాధారణ స్థితికి చేరడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.
First Published:  19 July 2015 1:32 PM GMT
Next Story