Telugu Global
Others

న‌మ్ర‌త‌ది హ‌త్యే.... సీబీఐ కేసు న‌మోదు

వ్యాపం కుంభ‌కోణంలో తొలి హ‌త్య కేసు న‌మోదు  వ్యాపం కుంభ‌కోణం ద‌ర్యాప్తు కోసం రంగంలోకి దిగిన వెంట‌నే సీబీఐ త‌న ద‌ర్యాప్తును శ‌ర‌వేగంగా ప్రారంభించింది. కుంభకోణంలో ప్ర‌మేయం ఉన్న మెడిసిన్ విద్యార్ధి న‌మ్ర‌త దామ‌ర్‌ది ఆత్మ‌హ‌త్య కాదు హ‌త్యేన‌ని భావించి ఆమేర‌కు సెక్ష‌న్ 302 కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. దీంతో వ్యాపం కుంభ‌కోణంలో తొలి హ‌త్య కేసు న‌మోదైంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని, బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వాన్నీ వ్యాపం కేసు  ఒక కుదుపు కుదప‌డ‌మే కాకుండా,  దేశ‌వ్యాప్తంగా […]

న‌మ్ర‌త‌ది హ‌త్యే.... సీబీఐ కేసు న‌మోదు
X
వ్యాపం కుంభ‌కోణంలో తొలి హ‌త్య కేసు న‌మోదు
వ్యాపం కుంభ‌కోణం ద‌ర్యాప్తు కోసం రంగంలోకి దిగిన వెంట‌నే సీబీఐ త‌న ద‌ర్యాప్తును శ‌ర‌వేగంగా ప్రారంభించింది. కుంభకోణంలో ప్ర‌మేయం ఉన్న మెడిసిన్ విద్యార్ధి న‌మ్ర‌త దామ‌ర్‌ది ఆత్మ‌హ‌త్య కాదు హ‌త్యేన‌ని భావించి ఆమేర‌కు సెక్ష‌న్ 302 కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. దీంతో వ్యాపం కుంభ‌కోణంలో తొలి హ‌త్య కేసు న‌మోదైంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని, బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వాన్నీ వ్యాపం కేసు ఒక కుదుపు కుదప‌డ‌మే కాకుండా, దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. మ‌హాత్మాగాంధీ మెడిక‌ల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్న న‌మ్ర‌త‌(19)కు ఈ కుంభ‌కోణంలో ప్ర‌మేయం ఉంది. కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చిన త‌ర్వాత న‌మ్ర‌త 2012 జ‌న‌వ‌రిలో ఉజ్జ‌యిని స‌మీపంలోని శివ్‌పురా భేరుపూర్ రైల్వే ట్రాక్‌పై శ‌వమై క‌న‌ప‌డింది. ఆ సమ‌యంలో ఇండోర్‌, బిలాస్‌పుర్ ట్రైన్ జ‌బ‌ల్‌పుర్‌కు వెళుతోంది. న‌మ్ర‌త మృత‌దేహానికి పోస్టుమార్టం నిర్వ‌హించ‌గా ఆమెను గొంతు నులిమి హ‌త్య చేశార‌ని వైద్యులు ప్ర‌క‌టించారు. పోలీసులు న‌మ్ర‌త‌ను అనుమానాస్ప‌ద వ్య‌క్తి హ‌త్య చేశాడ‌ని కేసు న‌మోదు చేశారు. ఆ త‌ర్వాత ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని పోలీసులు కేసును మార్చారు. ఈ కేసు విష‌య‌మై న‌మ్ర‌త తండ్రిని ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వెళ్లిన ఆజ్‌త‌క్ జ‌ర్న‌లిస్ట్ అక్ష‌య్‌సింగ్ కూడా అనుమాన‌స్ప‌దంగా మృతి చెందారు. అంతేకాకుండా ఈ కేసులో నిందితులు, సాక్షులు వ‌రుస‌గా అనుమాన‌స్ప‌దంగా మ‌ర‌ణిస్తున్నారు. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం తీసుకున్నా ఇలా మ‌ర‌ణించిన వారి సంఖ్య రెండు ప‌దుల‌కు పైగానే ఉంది. వ్యాపం కేసును సీబీఐతో ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని కాంగ్రెస్ నేత‌లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దీంతో సుప్రీం కేసు విచార‌ణ‌ను సీబీఐకు అప్ప‌గించింది.
First Published:  17 July 2015 11:47 PM GMT
Next Story