Telugu Global
NEWS

తండ్రి వేతనంలో కొంతభాగం ప్రత్యూషకు: హైకోర్టు ఆదేశం

సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూషకు తండ్రి వేతనంలో కొంత భాగం కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యూష సంరక్షణపై హైకోర్టు దృష్టి సారించింది. విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యూష కోరుకున్న చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ సందర్భంగా రెస్క్యూ హోంల నిర్వహణ ఆధ్వాన్నంగా ఉంటోందన్న హైకోర్టు అలాంటి చోటుకు తరలించేందుకు నిరాకరించింది. ప్రత్యూష హింసిస్తుంటే బంధువులు, చుట్టుపక్కల వారు స్పందించక పోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేసింది. […]

తండ్రి వేతనంలో కొంతభాగం ప్రత్యూషకు: హైకోర్టు ఆదేశం
X
సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూషకు తండ్రి వేతనంలో కొంత భాగం కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యూష సంరక్షణపై హైకోర్టు దృష్టి సారించింది. విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యూష కోరుకున్న చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ సందర్భంగా రెస్క్యూ హోంల నిర్వహణ ఆధ్వాన్నంగా ఉంటోందన్న హైకోర్టు అలాంటి చోటుకు తరలించేందుకు నిరాకరించింది. ప్రత్యూష హింసిస్తుంటే బంధువులు, చుట్టుపక్కల వారు స్పందించక పోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం ప్రత్యూష తండ్రి, మేనమామలను హాజరుపర్చాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ప్ర‌త్యూష మారుటి త‌ల్లి మొగం కూడా చూడ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. ప్ర‌త్యూష ఆరోగ్యం కోలుకున్న త‌ర్వాత త‌మ ఎదుట హాజ‌రు ప‌ర‌చాల‌ని ఆదేశించింది. ఆమెతో తాము స్వ‌యంగా మాట్లాడ‌తామ‌ని న్యాయ‌మూర్తి స్ప‌ష్టం చేశారు. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ప్ర‌త్యూష‌ను డిశ్చార్జి చేయొద్దు: హైకోర్టు
క‌న్న‌తండ్రి, స‌వితి త‌ల్లి చేతిలో చిత్ర‌హింస‌ల‌కు గురై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ప్ర‌త్యూష భ‌విష్య‌త్ ప‌ట్ల ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన‌ న్యాయ‌మూర్తి దిలీప్ బీ భోస‌లే నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. ప్ర‌త్యూష కేసు పూర్వాప‌రాలు, అందిస్తున్న వైద్య చికిత్స వివ‌రాల‌ను ఎల్బీ న‌గ‌ర్ పోలీసులు గురువారం హైకోర్టుకు అంద‌చేశారు. ఈ నివేదిక‌ను ప‌రిశీలించిన ధ‌ర్మాస‌నం తాము అనుమ‌తి ఇచ్చేవ‌ర‌కు ప్ర‌త్యూష‌ను ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేయ‌వ‌ద్ద‌ని ఆదేశించింది. ప్ర‌త్యూష సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌ను తెలుసుకునేందుకు ఆమె పెద‌నాన్న డిప్యూటీ క‌లెక్ట‌ర్ డి.స‌తీశ్‌చంద్ర‌ను శుక్ర‌వారం కోర్టులో హాజ‌రు ప‌ర‌చాల‌ని హైకోర్టు ఆదేశించింది. ప్ర‌త్యూష క‌న్న‌తండ్రి ర‌మేశ్‌కుమార్‌, స‌వితి త‌ల్లి శ్యామ‌ల పెట్టిన‌ చిత్ర‌హింస‌ల‌పై మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాలను చూసి చ‌లించి పోయిన హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ చ‌ల్లా కోదండ‌రాం ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి లేఖ రాయ‌డంతో ఈ కేసును హైకోర్టు సుమోటోగా స్వీక‌రించింది. పోలీసులు ప్ర‌త్యూష తండ్రిని, స‌వితిత‌ల్లిని అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌త్యూష ఆరోగ్యం కోలుకుంద‌ని, మాన‌సిక ప‌రిస్థితిపైనే ఆందోళ‌న‌గా ఉంద‌ని పోలీసులు హైకోర్టుకు తెలిపారు.
First Published:  17 July 2015 1:07 AM GMT
Next Story