Telugu Global
Others

జయ ఆరోగ్యస్థితిపై వదంతులకు చెక్!

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన ఆరోగ్యస్థితిపై వచ్చిన వదంతులను పటాపంచలు చేస్తూ బుధవారం సచివాలయానికి వచ్చారు.  ప్రభుత్వ కళాశాలల్లో కొత్తగా నియమితులైన 1006 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లలో ఐదుగురికి తన చేతుల మీదుగా ఆమె నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ నెల ఒకటో తేదీన అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో సొంత పార్టీ అన్నా డిఎంకె ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ఆమె హాజరుకాలేదు. దీంతో ముఖ్యమంత్రి ఆరోగ్య స్థితిపై ప్రకటన చేయాలని డిఎంకె అధినేత కరుణానిధి డిమాండ్‌ […]

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన ఆరోగ్యస్థితిపై వచ్చిన వదంతులను పటాపంచలు చేస్తూ బుధవారం సచివాలయానికి వచ్చారు. ప్రభుత్వ కళాశాలల్లో కొత్తగా నియమితులైన 1006 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లలో ఐదుగురికి తన చేతుల మీదుగా ఆమె నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ నెల ఒకటో తేదీన అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో సొంత పార్టీ అన్నా డిఎంకె ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ఆమె హాజరుకాలేదు. దీంతో ముఖ్యమంత్రి ఆరోగ్య స్థితిపై ప్రకటన చేయాలని డిఎంకె అధినేత కరుణానిధి డిమాండ్‌ చేస్తూ జయ ‘ఇక విరామం తీసుకోవాలి’ అని కూడా వ్యాఖ్యానించారు. ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి ఈనెల 4వ తేదీన సచివాలయానికి వచ్చిన జయ అదే రోజు అదానీ గ్రూప్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఒయు కుదుర్చుకున్న కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ఈ నెల 13ననే నియామక ఉత్తర్వులను ముఖ్యమంత్రి అందజేస్తారని ప్రకటించినా ఆ కార్యాక్రమానికి కూడా ఆమె గైర్హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కూడా జయ ఆరోగ్యస్థితిపై ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మీడియాలోనూ, సోషల్ వెబ్‌సైట్లలోనూ జయ ఆరోగ్యస్థితిపై రకరకాల కథనాలు హల్ చల్ చేశాయి. ఆపరేషన్‌ కోసం జయ అమెరికా వెళ్లనున్నారంటూ బిజెపి సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి చేసిన ట్వీట్‌ కూడా దుమారం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన అన్నా డిఎంకె సుబ్రహణ్య స్వామిపైనా, ఆయన వ్యాఖ్యలను పోస్ట్‌ చేసిన వెబ్‌సైట్లపైనా పరువునష్టం దావా వేసింది.
First Published:  15 July 2015 1:06 PM GMT
Next Story