Telugu Global
Others

పుష్కర పురోహితులపై ఆంక్షలు వద్దు: హైకోర్టు

పుష్కరాలలో సేవలందిస్తున్న పురోహితులను అధికారులు ఒక్క ఘాట్‌కే పరిమితం చేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. గుర్తింపు కార్డు పొందిన పురోహితులను ఏ ఘాట్‌లోనైనా భక్తులకు అవసరమైన సేవలు అందించడానికి అనుమతించాలని జస్టిస్‌ పి. నవీన్‌రావు స్పష్టం చేశారు. అఖిల భారత బ్రాహ్మణ యువజన సమాఖ్య అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యంపై వాదనలు విన్న ఆయన పుష్కరాల విధుల్లో పాల్గొంటున్న పండితులకు ఆంక్షలు విధించవద్దని, ఎక్కడైనా పూజాదికాలు నిర్వహించడానికి వారికి స్వేఛ్చ ఇవ్వాలని ఆదేశించారు. […]

పుష్కరాలలో సేవలందిస్తున్న పురోహితులను అధికారులు ఒక్క ఘాట్‌కే పరిమితం చేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. గుర్తింపు కార్డు పొందిన పురోహితులను ఏ ఘాట్‌లోనైనా భక్తులకు అవసరమైన సేవలు అందించడానికి అనుమతించాలని జస్టిస్‌ పి. నవీన్‌రావు స్పష్టం చేశారు. అఖిల భారత బ్రాహ్మణ యువజన సమాఖ్య అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యంపై వాదనలు విన్న ఆయన పుష్కరాల విధుల్లో పాల్గొంటున్న పండితులకు ఆంక్షలు విధించవద్దని, ఎక్కడైనా పూజాదికాలు నిర్వహించడానికి వారికి స్వేఛ్చ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పురోహితులకు వచ్చే పది రోజుల్లో ఏ ఘాట్‌లో అయినా పుష్కరాల విధులు నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది.
First Published:  14 July 2015 1:15 PM GMT
Next Story