Telugu Global
Others

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో  బీజేపీ సార‌ధి ద‌త్తాత్రేయ‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపించే బాధ్య‌త‌ను కేంద్రం కార్మిక‌శాఖ మంత్రి బండారు ద‌త్తాత్రేయ‌కు అప్ప‌గించింది. ఎన్నిక‌ల క‌మిటీ నిర్వ‌హ‌ణ చైర్మ‌న్‌గా బండారు ద‌త్తాత్రేయ‌ను, కన్వీన‌ర్‌గా బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత డా. కె.ల‌క్ష్మ‌ణ్‌ను నియ‌మిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నిక‌ల్లో రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డికి ఎలాంటి బాధ్య‌త‌లూ అప్ప‌గించ లేదు. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాలు సాధించ‌నందున కిష‌న్‌ రెడ్డిపై అధిష్టానం విశ్వాసాన్ని కోల్పోయిందని, ఇటీవ‌ల బెంగ‌ళూరులో జ‌రిగిన స‌మావేశంలో […]

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపించే బాధ్య‌త‌ను కేంద్రం కార్మిక‌శాఖ మంత్రి బండారు ద‌త్తాత్రేయ‌కు అప్ప‌గించింది. ఎన్నిక‌ల క‌మిటీ నిర్వ‌హ‌ణ చైర్మ‌న్‌గా బండారు ద‌త్తాత్రేయ‌ను, కన్వీన‌ర్‌గా బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత డా. కె.ల‌క్ష్మ‌ణ్‌ను నియ‌మిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నిక‌ల్లో రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డికి ఎలాంటి బాధ్య‌త‌లూ అప్ప‌గించ లేదు. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాలు సాధించ‌నందున కిష‌న్‌ రెడ్డిపై అధిష్టానం విశ్వాసాన్ని కోల్పోయిందని, ఇటీవ‌ల బెంగ‌ళూరులో జ‌రిగిన స‌మావేశంలో జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా కిష‌న్‌రెడ్డిపై ఫైర్ అయ్యార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఆ నేపథ్యంలో కిష‌న్‌రెడ్డి బాధ్య‌తలు తీసుకోవ‌డానికి నిరాక‌రించడంతో, మెజార్టీ నిర్ణ‌యం ప్ర‌కారం పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని బీసీ వ్య‌క్తికి క‌ట్ట‌బెట్ట‌డానికి ముంద‌స్తు ప‌రీక్ష‌గా ల‌క్ష్మ‌ణ్‌కు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల బాధ్య‌త అప్ప‌గించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేయ‌డంతోపాటు వారి గెలుపు బాధ్య‌తను కూడా ద‌త్తాత్రేయ‌, ల‌క్ష్మ‌ణ్‌ల పైనే పార్టీ అధిష్టానం ఉంచింది.
First Published:  12 July 2015 1:11 PM GMT
Next Story