Telugu Global
Others

డిగ్రీ పూర్త‌యిన వారికే అంగన్ వాడీ కొలువులు

మహిళలు, బాలల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన పథకాలను అంగన్‌వాడీ కేంద్రాల్లో సమర్ధవంతంగా అమలు చేయాలంటే కార్యకర్తకు కనీస విద్యార్హత డిగ్రీ  ఉండాలని టీ.సర్కార్‌ భావిస్తోంది. అందుకోసం అంగన్‌వాడీ కేంద్రంలో పని చేసే వర్కర్ల విద్యార్హతను పదో తరగతి నుంచి డిగ్రీకి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు అంగన్‌వాడీ వర్కర్ల విద్యార్హతను పదో తరగతి నుంచి డిగ్రీకి, సహాయకుల విద్యార్హతను ఏడు నుంచి పదో తరగతికి […]

డిగ్రీ పూర్త‌యిన వారికే అంగన్ వాడీ కొలువులు
X
మహిళలు, బాలల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన పథకాలను అంగన్‌వాడీ కేంద్రాల్లో సమర్ధవంతంగా అమలు చేయాలంటే కార్యకర్తకు కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలని టీ.సర్కార్‌ భావిస్తోంది. అందుకోసం అంగన్‌వాడీ కేంద్రంలో పని చేసే వర్కర్ల విద్యార్హతను పదో తరగతి నుంచి డిగ్రీకి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు అంగన్‌వాడీ వర్కర్ల విద్యార్హతను పదో తరగతి నుంచి డిగ్రీకి, సహాయకుల విద్యార్హతను ఏడు నుంచి పదో తరగతికి పెంచాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం కనుక ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని పది జిల్లాల సీడీపీవో ప్రాజెక్టుల కింద 1,800 అంగన్‌వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ శాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ చదివిన వారు లభ్యం కానిపక్షంలో పట్టణ కేంద్రాలను ఏ కేటగిరీ, గ్రామీణ కేంద్రాలను బీ కేటిగిరీగా విభజించి పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ తప్పనిసరి చేయాలని అధికారులు సూచించారు. టీ.సర్కార్‌ ఇటీవలే రూ.4,200లుగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్ల వేతనాన్నిరూ.7 వేలకు, హెల్పర్ల జీతాన్ని రూ.2,200 నుంచి రూ.4,500 లకు పెంచింది.

First Published:  10 July 2015 1:10 PM GMT
Next Story