Telugu Global
Others

ఆంధ్ర విద్యుత్‌ ఉద్యోగుల తొలగింపుపై కేంద్రం సీరియస్‌!

ఆంధ్ర ఉద్యోగుల పేరుతో 1259 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి తొలగించడాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశంపై చర్చించడానికి 31వ తేదీ ఉదయుం 11 గంటలకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, ఇంధన కార్యదర్శులు, సీఎండీలు ఈ సమావేశానికి హాజరుకావాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంముంత్రిత్వ శాఖ సంబంధితులకు లేఖలు రాసింది. విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగుల విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి గత మార్చి 20 హైదరాబాద్‌కు వచ్చారు. […]

ఆంధ్ర విద్యుత్‌ ఉద్యోగుల తొలగింపుపై కేంద్రం సీరియస్‌!
X
ఆంధ్ర ఉద్యోగుల పేరుతో 1259 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి తొలగించడాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశంపై చర్చించడానికి 31వ తేదీ ఉదయుం 11 గంటలకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, ఇంధన కార్యదర్శులు, సీఎండీలు ఈ సమావేశానికి హాజరుకావాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంముంత్రిత్వ శాఖ సంబంధితులకు లేఖలు రాసింది. విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగుల విభజనకు సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి గత మార్చి 20 హైదరాబాద్‌కు వచ్చారు. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఇంధన శాఖ కార్యదర్శులు, సీఎండీలతో సమావేశమయ్యారు. ఉద్యోగుల విభజను పరస్పర అంగీకారంతో జరగాలని ఓ తీర్మానం చేశారు. దీనిపై సీఎస్‌లు సంతకాలు కూడా చేశారు. అయితే.. ఏపీ మూలాలున్న1259 మంది ఉద్యోగులను రిలీవ్‌ చేస్తూ జూన్‌ 9న తెలంగాణ ఇంధన శాఖ ఆదేశాలిచ్చింది. ఇది అన్యాయమంటూ రిలీవ్‌ అయిన ఉద్యోగులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రి వెంకయ్య సమక్షంలో రాజ్‌నాథ్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. ఒకేసారి 1259మంది ఉద్యోగులను తొలగించడమేమిటని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈఅంశాన్ని దృష్టిలో పెట్టుకుంటామని, తప్పనిసరిగా న్యాయం చేస్తామని ఆయ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 31 తేదీన ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం కావాలి హోం మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ణయించారు.
First Published:  8 July 2015 9:49 PM GMT
Next Story