Telugu Global
Others

తెలంగాణ టీడీపీ నేత‌ల అంత‌ర్మ‌థ‌నం

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాట విన్నందుకే తమకు ఈ గతి పట్టిందని టీడీపీ నేతల కుటుంబ సభ్యులు, వారి అనుచరులు బాధపడుతున్నారట. బయటకు చెప్పకున్నా..ఈవిషయంలో లోలోప‌లే అంత‌ర్మ‌థ‌నం చెందుతున్న‌ట్లు తెలిసింది. ఒక్క ఎమ్మెల్సీ సీటు ఉంటే ఎంత?  పోతే ఎంత?  దాని కోసం పార్టీ అధినేత తమ భవిష్యత్తుతో ఆటాడుకున్నారని తెలిసినవారి దగ్గర వాపోతున్నారు. ఎమ్మెల్యే సండ్ర అభిమానులు సైతం ఇప్పుడు ఇదే అభిప్రాయంతో ఉన్నారని సమాచారం. వేం నరేందర్ రెడ్డి హాజరైనపుడు ఎలాంటి అరెస్టు […]

తెలంగాణ టీడీపీ నేత‌ల అంత‌ర్మ‌థ‌నం
X
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాట విన్నందుకే తమకు ఈ గతి పట్టిందని టీడీపీ నేతల కుటుంబ సభ్యులు, వారి అనుచరులు బాధపడుతున్నారట. బయటకు చెప్పకున్నా..ఈవిషయంలో లోలోప‌లే అంత‌ర్మ‌థ‌నం చెందుతున్న‌ట్లు తెలిసింది. ఒక్క ఎమ్మెల్సీ సీటు ఉంటే ఎంత? పోతే ఎంత? దాని కోసం పార్టీ అధినేత తమ భవిష్యత్తుతో ఆటాడుకున్నారని తెలిసినవారి దగ్గర వాపోతున్నారు. ఎమ్మెల్యే సండ్ర అభిమానులు సైతం ఇప్పుడు ఇదే అభిప్రాయంతో ఉన్నారని సమాచారం. వేం నరేందర్ రెడ్డి హాజరైనపుడు ఎలాంటి అరెస్టు జరగలేదు కదా! అలాంటిది సండ్ర హాజరై ఉంటే ఏమీ కాకపోయిఉండేది కాదని వారు అనుకుంటున్నారట. ఏసీబీ పోలీసులకు కనీసం సమాచారం ఇవ్వకుండా తమ నేత కొరివితో తలగోక్కున్నాడని, వెళ్లి ఏపీలో తలదాచుకుని చేజేతులా వివాదాన్ని మరింత పెద్దదిగా చేసుకున్నారని చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో నిందితులైన టీడీపీ నేతలంతా చంద్రబాబు మాట విని ఉండాల్సింది కాదని పలువురు తెలంగాణ టీడీపీ నేతలు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని స‌మాచారం. ఎంత తమపార్టీ ఏపీలో అధికారంలో ఉన్నా.. ఇక్కడ తాము ప్రతిపక్షమన్న సంగతి మరచి, అధికార పార్టీతో పెట్టుకుని త‌ప్పు చేశామ‌న్న ప‌శ్చాతాపం వారిలో వ్య‌క్త‌మ‌వుతోంద‌ట‌. ఈ ఘ‌ట‌న‌తో తమకు ప్రజల్లో మొహం లేకుండా చేసుకున్నామని స్నేహితులతో చెప్పుకున్నట్లు తెలిసింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక తాము ఎన్నికల్లో మళ్లా ఏ ముఖంతో పోటీ చేస్తామో అర్థం కావడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఓటుకు నోటు వ్యవహారం బయటపడ్డప్పటి నుంచి కనీసం నియోజకవర్గాల్లో పర్యటించేందుకు కూడా తెలంగాణ టీడీపీ నేతలు కాలు బయట మోపలేదంటే..వారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.
First Published:  7 July 2015 8:16 PM GMT
Next Story