Telugu Global
Others

జాతీయ‌త నిర్ధార‌ణ‌కు స‌ర్వే ప్రారంభం

41 ఏళ్లుగా న‌లుగుతున్న భార‌త్-బంగ్లా స‌రిహ‌ద్దు వివాదం స‌మ‌సి పోవ‌డంతో ఈ భూభాగాల్లో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల జాతీయ‌త‌ను నిర్ణ‌యించేందుకు రెండు ప్ర‌భుత్వాలు చేపట్టిన ఉమ్మ‌డి స‌ర్వే ప్రారంభ‌మైంది. ఈ భూభాగాల్లోని ప్ర‌జ‌లు త‌మ‌కు న‌చ్చిన దేశ జాతీయ‌త‌ను ఎంపిక చేసుకుంటారు. 1974లో జ‌రిగిన ల్యాండ్ బౌండ్రీ అగ్రిమెంట్ (ఎల్‌బిఏ) ఒప్పందం ప్ర‌కారం రెండు దేశాలు 162 భూభాగాల‌ను మార్చుకున్నాయి. అందులో భాగంగానే రెండు దేశాల స‌రిహ‌ద్దుల్లోను ఈ స‌ర్వేను నిర్వ‌హిస్తున్నారు. మొత్తం 162 ప్ర‌దేశాల్లోని 51,854 మందిపై […]

41 ఏళ్లుగా న‌లుగుతున్న భార‌త్-బంగ్లా స‌రిహ‌ద్దు వివాదం స‌మ‌సి పోవ‌డంతో ఈ భూభాగాల్లో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల జాతీయ‌త‌ను నిర్ణ‌యించేందుకు రెండు ప్ర‌భుత్వాలు చేపట్టిన ఉమ్మ‌డి స‌ర్వే ప్రారంభ‌మైంది. ఈ భూభాగాల్లోని ప్ర‌జ‌లు త‌మ‌కు న‌చ్చిన దేశ జాతీయ‌త‌ను ఎంపిక చేసుకుంటారు. 1974లో జ‌రిగిన ల్యాండ్ బౌండ్రీ అగ్రిమెంట్ (ఎల్‌బిఏ) ఒప్పందం ప్ర‌కారం రెండు దేశాలు 162 భూభాగాల‌ను మార్చుకున్నాయి. అందులో భాగంగానే రెండు దేశాల స‌రిహ‌ద్దుల్లోను ఈ స‌ర్వేను నిర్వ‌హిస్తున్నారు. మొత్తం 162 ప్ర‌దేశాల్లోని 51,854 మందిపై అధికారులు స‌ర్వే నిర్వ‌హిస్తారు. భార‌త్‌కు చెందిన 111 భూభాగాల్లో 50 బృందాలు, బంగ్లాదేశ్‌కు చెందిన 51 భూభాగాల్లో 25 బృందాలు 16 రోజుల పాటు స‌ర్వే చేస్తాయి. ఒక్కో బృందంలో ఐదుగురు స‌భ్యులుంటారు. జాతీయ‌త నిర్ధార‌ణ తుది జాబితాను ఈనెల 31న అధికారులు విడుద‌ల చేస్తారు. అనంత‌రం ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు ఆయా దేశాలు వారి పున‌రావాసానికి చ‌ర్య‌లు తీసుకుంటాయి.

First Published:  6 July 2015 1:16 PM GMT
Next Story