Telugu Global
Others

మెస్‌ బకాయిల కోసం ఓయూలో విద్యార్థుల భిక్షాటన

తెలంగాణ ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయల మెస్‌ బకాయిలను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు కడియం రాజు, ఎల్లస్వామి మాట్లాడుతూ విద్యార్థుల మెస్‌ బకాయిలు రూ.7 కోట్లను ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం చేసి ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. 16 రోజులుగా విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. విద్యార్థుల కడుపు మాడే […]

తెలంగాణ ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయల మెస్‌ బకాయిలను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు కడియం రాజు, ఎల్లస్వామి మాట్లాడుతూ విద్యార్థుల మెస్‌ బకాయిలు రూ.7 కోట్లను ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం చేసి ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. 16 రోజులుగా విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. విద్యార్థుల కడుపు మాడే పరిస్థితి కేసీఆర్ చూడాలనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు.
First Published:  6 July 2015 1:19 PM GMT
Next Story