Telugu Global
Others

సిద్ధిపేట న‌ర్స‌రీలో మొలిచిన మొక్క‌ను నేను: కేసీఆర్ 

సిద్ధిపేట‌కు మ‌రో మూడేళ్ళ‌లో గోదావ‌రి జ‌లాలు ఇస్తామ‌ని, దీంతోపాటు సిద్ధిపేట‌తోపాటు వ‌రంగ‌ల్ జిల్లా జ‌న‌గామ‌కు కూడా ఇక్క‌డ నుంచే నీరు వెళుతుంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు పిలుపు ఇచ్చారు. తెలంగాణ ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని శ‌నివారం సిద్ధిపేట‌లో ప్రారంభించిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాను ఇక్క‌డ‌కు వ‌స్తున్న‌ప్పుడు ఓ పెద్దాయ‌న తార‌స ప‌డ్డాడ‌ని, ఎక్క‌డికి పోతున్నావ్ బిడ్డా అని అడిగితే సిద్ధిపేట‌కు పోతున్నాన‌ని చెప్పాన‌ని, ఎందుకు అని అడిగితే మొక్క‌ల పెంప‌కం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌డానికని […]

సిద్ధిపేట న‌ర్స‌రీలో మొలిచిన మొక్క‌ను నేను: కేసీఆర్ 
X
సిద్ధిపేట‌కు మ‌రో మూడేళ్ళ‌లో గోదావ‌రి జ‌లాలు ఇస్తామ‌ని, దీంతోపాటు సిద్ధిపేట‌తోపాటు వ‌రంగ‌ల్ జిల్లా జ‌న‌గామ‌కు కూడా ఇక్క‌డ నుంచే నీరు వెళుతుంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు పిలుపు ఇచ్చారు. తెలంగాణ ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని శ‌నివారం సిద్ధిపేట‌లో ప్రారంభించిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాను ఇక్క‌డ‌కు వ‌స్తున్న‌ప్పుడు ఓ పెద్దాయ‌న తార‌స ప‌డ్డాడ‌ని, ఎక్క‌డికి పోతున్నావ్ బిడ్డా అని అడిగితే సిద్ధిపేట‌కు పోతున్నాన‌ని చెప్పాన‌ని, ఎందుకు అని అడిగితే మొక్క‌ల పెంప‌కం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌డానికని తెలిపాన‌ని అన్నారు. అప్పుడాయ‌న ఏమ‌న్నాడంటే… సిద్ధిపేట‌లోనే పెద్ద వృక్ష‌ముంది ఇంక అక్క‌డ మొక్క‌లెందుక‌ని ప్ర‌శ్నించాడ‌ని… అదేంది పెద్దాయ‌నా అని అడిగితే మా ముఖ్య‌మంత్రే అక్క‌డ పెద్ద చెట్ట‌ని, ఇంక అక్క‌డ మొక్క‌ల‌క్క‌ర్లేద‌ని అన్నాడ‌ని కేసీఆర్ వివ‌రించారు. ఈ విష‌యాన్ని చెబుతూ నిజానికి నేనే ఈ సిద్ధిపేట న‌ర్స‌రీలో మొలిచిన మొక్క‌ని, ఇప్పుడు మీ ద‌య వ‌ల్ల చెట్టుగా మారి వృక్షాన్న‌య్యాయ‌ని, మీకు నీడనిచ్చే విధంగా న‌న్ను త‌యారు చేసిన మీ అంద‌రికీ శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాన‌ని కేసీఆర్ అన్నారు. వ‌జ్రాలు పెట్టి కొందామ‌న్నా సొంతూరులో ల‌భించే ప్రేమ దొర‌క‌ద‌ని ఆయ‌న చెప్పారు. సిద్ధిపేట‌కు అన్ని వ‌స‌తులు క‌ల్పిస్తాన‌ని, త్వ‌ర‌లో ఇక్క‌డికి రైలు వ‌స్తుంద‌ని, ఇందుకు కావాల్సినవ‌న్నీ పూర్తి చేశామ‌ని, అలాగే త్వ‌ర‌లోనే కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేస్తాన‌ని, అందులో మీరంతా భాగ‌స్వాములు కావాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు. సిద్ధిపేట త్వ‌ర‌లోనే జిల్లా కేంద్రం అవుతుంద‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ హ‌రిత‌హారాన్ని విజ‌యవంతం చేయాల‌ని, ప్ర‌తి ఒక్క‌రూ క‌నీసం రెండు మొక్క‌లు నాటాల‌ని కేసీఆర్ పిలుపు ఇచ్చారు.
First Published:  4 July 2015 5:19 AM GMT
Next Story