Telugu Global
Others

ఆన్‌లైన్‌లో కో-ఆప్టెక్స్.. సేంద్రియ ప‌త్తి చీరలు!

పర్యావరణహిత సేంద్రియ పత్తి చీరను సేలంలోని తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ కో-ఆప్టెక్స్‌ తొలిసారిగా ఆవిష్కరించింది. సేలం నగరంలోని ‘తంగంపట్టు మాలిగై’ షోరూంలో.. కో-ఆప్టెక్స్‌ ఎండి టీఎన్‌ వెంకటేశ్‌ ఈ చీరను విడుదల చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా చీరల అమ్మకాన్ని కూడా కో-ఆప్టెక్స్‌ ప్రారంభించిందని ఆయ‌న తెలిపారు. రసాయనాలు, ఆధునిక ఎరువులు వినియోగించకుండా పండించిన పత్తితో ఈ సేంద్రియ చీరలు తయారు చేశామని ఆయన తెలిపారు. చీరకు అద్దిన రంగులు కూడా ప్రకృతి సహజమె ౖన పూలు, […]

పర్యావరణహిత సేంద్రియ పత్తి చీరను సేలంలోని తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ కో-ఆప్టెక్స్‌ తొలిసారిగా ఆవిష్కరించింది. సేలం నగరంలోని ‘తంగంపట్టు మాలిగై’ షోరూంలో.. కో-ఆప్టెక్స్‌ ఎండి టీఎన్‌ వెంకటేశ్‌ ఈ చీరను విడుదల చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా చీరల అమ్మకాన్ని కూడా కో-ఆప్టెక్స్‌ ప్రారంభించిందని ఆయ‌న తెలిపారు. రసాయనాలు, ఆధునిక ఎరువులు వినియోగించకుండా పండించిన పత్తితో ఈ సేంద్రియ చీరలు తయారు చేశామని ఆయన తెలిపారు. చీరకు అద్దిన రంగులు కూడా ప్రకృతి సహజమె ౖన పూలు, మొక్కలు, మూలికల నుంచి సేకరించినవేనని చెప్పారు. చేనేత మగ్గాలపై రూపొందించిన ఈ చీరల ఖరీదు రూ. 2,750 నుంచి నాలుగు వేల రూపాయ‌ల‌ మధ్య ఉంటుందన్నారు. ఇవి చాలా తేలిగ్గా ఉంటాయన్నారు.
First Published:  29 Jun 2015 1:09 PM GMT
Next Story