Telugu Global
Others

అమెరికాలో అన్న ఎన్టీఆర్ విగ్ర‌హం

తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని న‌లుదిశ‌లా చాటిన అన్న ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని అమెరికాలో ప్ర‌తిష్ఠించ‌నున్నారు. న‌టుడిగా, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడిగా, ముఖ్య‌మంత్రిగా ఆయ‌న చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన‌వి. అందుకే అన్న ఎన్టీఆర్ మ‌ర‌ణించి ఏళ్లు గ‌డిచినా తెలుగు ప్ర‌జ‌ల గుండెలపై ఆయ‌న ముద్ర‌  చెరిగి పోలేదు. అంతేకాదు ఆయ‌న ఖ్యాతి ఖండాంత‌రాల‌కు వ్యాపిస్తోంది.  అమెరికాలోని కాలిఫోర్నియాలో జూలై 5న  కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు ఆవిష్క‌రించ‌నున్నారు. వారం రోజుల అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా […]

తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని న‌లుదిశ‌లా చాటిన అన్న ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని అమెరికాలో ప్ర‌తిష్ఠించ‌నున్నారు. న‌టుడిగా, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడిగా, ముఖ్య‌మంత్రిగా ఆయ‌న చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన‌వి. అందుకే అన్న ఎన్టీఆర్ మ‌ర‌ణించి ఏళ్లు గ‌డిచినా తెలుగు ప్ర‌జ‌ల గుండెలపై ఆయ‌న ముద్ర‌ చెరిగి పోలేదు. అంతేకాదు ఆయ‌న ఖ్యాతి ఖండాంత‌రాల‌కు వ్యాపిస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జూలై 5న కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు ఆవిష్క‌రించ‌నున్నారు. వారం రోజుల అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈనెల 29న అమెరికా బ‌య‌లుదేర‌నున్న వెంక‌య్య నాయుడు అమెరికాలోని తెలుగు ప్ర‌జ‌లు ఏర్పాటు చేసిన మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు.

First Published:  28 Jun 2015 1:08 PM GMT
Next Story