Telugu Global
Cinema & Entertainment

మహేష్ బ్రహ్మోత్సవం ముగ్గురితో

ఇన్నాళ్లూ సింగిల్ హీరోయిన్ తోనే రొమాన్స్ చేసిన మహేష్ బాబు, బ్రహ్మోత్సవంతో ఒకేసారి ముగ్గురు భామలతో ప్రేమాయణం సాగించడానికి సిద్ధమౌతున్నాడు. బ్రహ్మోత్సవం సినిమాతో మహేష్-సమంత ముచ్చటగా మూడోసారి కలుస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో సమంతతో పాటు కాజల్, ప్రణీతలను కూడా హీరోయిన్లుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ మూవీలో ముగ్గురు భామలతో ఆడిపాడనున్నాడు […]

మహేష్ బ్రహ్మోత్సవం ముగ్గురితో
X

ఇన్నాళ్లూ సింగిల్ హీరోయిన్ తోనే రొమాన్స్ చేసిన మహేష్ బాబు, బ్రహ్మోత్సవంతో ఒకేసారి ముగ్గురు భామలతో ప్రేమాయణం సాగించడానికి సిద్ధమౌతున్నాడు. బ్రహ్మోత్సవం సినిమాతో మహేష్-సమంత ముచ్చటగా మూడోసారి కలుస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో సమంతతో పాటు కాజల్, ప్రణీతలను కూడా హీరోయిన్లుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ మూవీలో ముగ్గురు భామలతో ఆడిపాడనున్నాడు ప్రిన్స్. వీళ్లతో మహేశ్-సమంతది హ్యాట్రిక్ కాంబినేషన్ అయితే.. మహేష్-కాజల్ ది బిజినెస్ మేన్ సినిమా తర్వాత రెండో కాంబినేషన్. ఇక మహేష్-ప్రణీతది ఫ్రెష్ కాంబినేషన్. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న బ్రహ్మోత్సవం ప్రారంభమైంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కు సంబంధించి మహేష్ బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. పీవీపీ బ్యానర్ పై ప్రసాద్ వి.పొట్లూరు నిర్మిస్తున్నారు ఈ సినిమాని. జులై 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

First Published:  28 Jun 2015 10:35 PM GMT
Next Story