Telugu Global
Others

ప‌థ‌కాలు ప్ర‌జ‌ల చెంత‌కు చేర్చండి: నాయ‌కుల‌కు బాబు పిలుపు

ప్ర‌భుత్వం వ‌ద్ద త‌గిన‌న్ని నిధులు లేక‌పోయినా రైతు, డ్వాక్రా మ‌హిళ‌ల రుణాలు మాఫీ చేస్తున్నామ‌ని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్‌. చంద్ర‌బాబు నాయుడు అన్నారు. శనివారం టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్న పనులు చేయగలుగుతున్నామ‌న్నారు. రూ. 5 వేల కోట్ల‌తో ఎస్సీ స‌బ్ ప్లాన్‌, రూ. 2 వేల కోట్ల‌తో ఎస్టీ స‌బ్ ప్లాన్‌, రూ. 6 వేల కోట్ల‌తో బీసీ స‌బ్ ప్లాన్ అమ‌లు చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. […]

ప‌థ‌కాలు ప్ర‌జ‌ల చెంత‌కు చేర్చండి: నాయ‌కుల‌కు బాబు పిలుపు
X
ప్ర‌భుత్వం వ‌ద్ద త‌గిన‌న్ని నిధులు లేక‌పోయినా రైతు, డ్వాక్రా మ‌హిళ‌ల రుణాలు మాఫీ చేస్తున్నామ‌ని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్‌. చంద్ర‌బాబు నాయుడు అన్నారు. శనివారం టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్న పనులు చేయగలుగుతున్నామ‌న్నారు. రూ. 5 వేల కోట్ల‌తో ఎస్సీ స‌బ్ ప్లాన్‌, రూ. 2 వేల కోట్ల‌తో ఎస్టీ స‌బ్ ప్లాన్‌, రూ. 6 వేల కోట్ల‌తో బీసీ స‌బ్ ప్లాన్ అమ‌లు చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. నాయ‌కులు, కార్య‌కర్త‌లంతా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప‌థ‌కాలు ప‌క‌డ్బందీగా అమ‌లు చేయ‌డానికి త్వరలో అన్ని శాఖల కార్యాలయాలను విజయవాడకు తరలించనున్నట్లు చెప్పారు. వారానికి నాలుగు రోజులు విజయవాడలోనే ఉంటానని… కార్యాలయం పూర్తి కాకున్నా బస్సులోనే ఉండి కార్యకలాపాలు సాగిస్తానని చంద్రబాబు తెలిపారు.
సమస్యలపై కూర్చుని మాట్లాడుకుందామంటే తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం లేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. సెక్షన్-8 పై తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యను గవర్నర్‌కు చెప్పినా పరిష్కారం కాలేదన్నారు. 9, 10 షెడ్యూల్‌ సంస్థలపై తెలంగాణ ప్రభుత్వ తీరు సరికాదని సీఎం తెలిపారు. వైసీపీని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. టీడీపీని దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వైసీపీ కుట్ర చేస్తున్నాయని చంద్రబాబునాయుడు ఆరోపించారు.
First Published:  26 Jun 2015 1:25 PM GMT
Next Story