Telugu Global
Others

బిజేపీతో తెగదెంపులు చేసుకోనున్న టీడీపీ?

ఓటుకు కోట్లు వ్య‌వ‌హారంలో పీక‌ల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చంద్ర‌బాబు ఆయ‌న స‌హ‌చ‌రుల‌కు ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. సెక్ష‌న్ – 8 వివాదాన్ని ర‌గిల్చి అంద‌రి దృష్టినీ మ‌ర‌ల్చాల‌నుకున్న చంద్ర‌బాబు పాచిక పార‌లేదు. గ‌వ‌ర్న‌ర్‌కు విశేషాధికారాల‌ను క‌ట్ట‌బెట్టే సెక్ష‌న్ -8 ను విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప ఉప‌యోగించ‌రాద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు సూచించిన‌ట్లు తెలిసింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఆ శాఖ కార్య‌ద‌ర్శి ఎల్‌.సి.గోయ‌ల్‌తో న‌ర‌సింహ‌న్ సుదీర్ఘంగా సమావేశ‌మైన […]

బిజేపీతో తెగదెంపులు చేసుకోనున్న టీడీపీ?
X

ఓటుకు కోట్లు వ్య‌వ‌హారంలో పీక‌ల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చంద్ర‌బాబు ఆయ‌న స‌హ‌చ‌రుల‌కు ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. సెక్ష‌న్ – 8 వివాదాన్ని ర‌గిల్చి అంద‌రి దృష్టినీ మ‌ర‌ల్చాల‌నుకున్న చంద్ర‌బాబు పాచిక పార‌లేదు. గ‌వ‌ర్న‌ర్‌కు విశేషాధికారాల‌ను క‌ట్ట‌బెట్టే సెక్ష‌న్ -8 ను విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప ఉప‌యోగించ‌రాద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు సూచించిన‌ట్లు తెలిసింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఆ శాఖ కార్య‌ద‌ర్శి ఎల్‌.సి.గోయ‌ల్‌తో న‌ర‌సింహ‌న్ సుదీర్ఘంగా సమావేశ‌మైన సంద‌ర్భంగా ఈవిధ‌మైన స్ప‌ష్ట‌త ఇ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసును ద‌ర్యాప్తు సంస్థ ఏసీబీకే వ‌దిలిపెట్టాల‌ని కేంద్రం స్ప‌ష్టంగా తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం. ఈ వ్య‌వ‌హారంలో సాక్ష్యాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నందున గ‌వ‌ర్న‌ర్‌ను జోక్యం చేసుకోవ‌ద్ద‌ని సూచించింద‌ని అధికార వ‌ర్గాలు అంటున్నాయి. రాజ్‌నాథ్‌తో భేటీ సంద‌ర్భంగా రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌నితీరు, రెండింటి మ‌ధ్య కొన‌సాగుతున్న వివాదాలు, ఓటుకు కోట్లు కేసు, దానికి పోటీగా ట్యాపింగ్ పై విచార‌ణ పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేయ‌డం వంటి విష‌యాల‌న్నిటినీ కూలంక‌షంగా గ‌వ‌ర్న‌ర్ వివ‌రించిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. అన్నిటినీ సావ‌ధానంగా విన్న రాజ్‌నాథ్ ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ ద‌ర్యాప్తులో ఎలాంటి జోక్య‌మూ ఉండ‌రాద‌ని గ‌వ‌ర్న‌ర్‌కు స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. అంటే చంద్ర‌బాబు కేంద్రంపై పెట్టుకున్న ఆశ‌లు వ‌మ్మ‌యిపోయిన‌ట్లేన‌ని ప‌రిశీల‌కులంటున్నారు. గ‌వ‌ర్న‌ర్ ను ఉప‌యోగించుకుని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌ని, ఏసీబీ దూకుడుకు క‌ళ్లెం వేయ‌వ‌చ్చ‌ని భావించిన చంద్ర‌బాబుకు ఇక చివ‌రి ఆశ కూడా అడుగంటిపోయిన‌ట్లేన‌ని భావించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై చాలా కోపంగా ఉన్నారు. చంద్రబాబుపై కేసు నమోదు అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందని రాష్ట్రంలోను, కేంద్రంలోను అనేకమంది సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో చంద్రబాబు బిజేపీ మీద చాలా కోపంగా ఉన్నారు. తను రాజీనామా చేయాల్సిన పరిస్థితే వస్తే బిజేపీతో తెగదెంపులు చేసుకుంటానని కేంద్రానికి సంకేతాలు పంపినట్లుగా తెలుస్తోంది. తను పదవిలోంచి దిగిపోవాల్సిన పరిస్థితే వస్తే ఇక బిజేపీతో కలిసి ఉండి ప్రయోజనం ఏమిటని సహచరుల ముందు చంద్రబాబు కోపంగా నిలదీస్తున్నాడని తెలుస్తోంది.

First Published:  27 Jun 2015 12:29 AM GMT
Next Story