Telugu Global
Others

ఆత్మహత్య యత్నంలో ముగ్గురు టెన్త్‌ విద్యార్థులు మృతి

ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు టెన్త్‌ విద్యార్థుల్లో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి వికటించింది. దీంతో వీరిని బెంగుళూరు తరలిస్తుండగా దారిలోనే ఇద్దరు మరణించారు. మరొకరు బెంగుళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మొత్తం ముగ్గురు విద్యార్థులు కూడా ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోవడం ఆయా పిల్లల కుటుంబాలు మానసికంగా కుమిలిపోతున్నాయి. అసలేం జరిగిందంటే… రోజూ స్కూలుకు వెళ్ళాల్సి వ‌స్తుంద‌న్న బాధ‌తో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే ముగ్గురు కుర్రాళ్ళు విష గుళిక‌ల […]

ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు టెన్త్‌ విద్యార్థుల్లో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి వికటించింది. దీంతో వీరిని బెంగుళూరు తరలిస్తుండగా దారిలోనే ఇద్దరు మరణించారు. మరొకరు బెంగుళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మొత్తం ముగ్గురు విద్యార్థులు కూడా ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోవడం ఆయా పిల్లల కుటుంబాలు మానసికంగా కుమిలిపోతున్నాయి.
అసలేం జరిగిందంటే…
రోజూ స్కూలుకు వెళ్ళాల్సి వ‌స్తుంద‌న్న బాధ‌తో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే ముగ్గురు కుర్రాళ్ళు విష గుళిక‌ల పొడి తిని ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించారు. వీరి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌డంతో ఆస్ప‌త్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు. ఈ సంఘ‌ట‌న అనంత‌పురం జిల్లా యాడికి మండ‌లం వెంగ‌న్న‌ప‌ల్లి కొండ‌మీద జ‌రిగింది. గ్రామానికి చెందిన చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, రాజారెడ్డి, నాగేశ్వ‌ర‌రెడ్డి అనే ముగ్గురు విద్యార్థులు చ‌దువును భారంగా భావించారు. ప్ర‌తి రోజూ స్కూలు కెళ్ళ‌డం ఇబ్బందిగా ఫీల‌య్యారు. దీంతో త‌మ‌కు అందుబాటులో ఉన్న విష గుళిక‌ల‌ను పొడిగా చేసుకుని నీళ్ళ‌లో క‌లుపుకుని తాగేశారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన పెద్ద‌లు వెంట‌నే వారిని అనంత‌పురం ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారికి చికిత్స జ‌రుగుతోంది.
First Published:  25 Jun 2015 1:06 PM GMT
Next Story