Telugu Global
Others

తెలంగాణ‌కు అన్యాయం చేశారా...?

నీటి కేటాయింపుల్లో  తెలంగాణ‌కు అన్యాయం చేశారా? అంటూ కేంద్రం ఏపీని ప్ర‌శ్నించింది.  నీటి కేటాయింపుల్లో త‌మ రాష్ట్రానికి అన్యాయం జ‌రిగిందంటూ తెలంగాణ ప్ర‌భుత్వం  చేసిన ఫిర్యాదుపై  కేంద్రం స్పందించింది. త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని స‌వ‌రించ‌డానికి కొత్త ట్రైబ్యున‌ల్ ఏర్పాటు చేయాల‌ని లేదా కృష్ణా జ‌ల‌వివాద ట్రైబ్యున‌ల్ -2కు అప్ప‌గించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన ఫిర్యాదుపై అభిప్రాయాన్ని తెల‌ప‌మ‌ని కేంద్రం ఏపీని కోరింది. ఈమేర‌కు జ‌ల‌వ‌న‌రుల మంత్రిత్వ శాక అద‌న‌పు కార్య‌ద‌ర్శి అమ‌ర్ జిత్ సింగ్ ఏపీ ప్ర‌భుత్వ […]

నీటి కేటాయింపుల్లో తెలంగాణ‌కు అన్యాయం చేశారా? అంటూ కేంద్రం ఏపీని ప్ర‌శ్నించింది. నీటి కేటాయింపుల్లో త‌మ రాష్ట్రానికి అన్యాయం జ‌రిగిందంటూ తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందించింది. త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని స‌వ‌రించ‌డానికి కొత్త ట్రైబ్యున‌ల్ ఏర్పాటు చేయాల‌ని లేదా కృష్ణా జ‌ల‌వివాద ట్రైబ్యున‌ల్ -2కు అప్ప‌గించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన ఫిర్యాదుపై అభిప్రాయాన్ని తెల‌ప‌మ‌ని కేంద్రం ఏపీని కోరింది. ఈమేర‌కు జ‌ల‌వ‌న‌రుల మంత్రిత్వ శాక అద‌న‌పు కార్య‌ద‌ర్శి అమ‌ర్ జిత్ సింగ్ ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావుకు లేఖ రాశారు. కృష్ణా జ‌లాల్లో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని, దీన్ని స‌వ‌రించి న్యాయం చేయ‌డానికి కొత్త ట్రైబ్యున‌ల్‌ను ఏర్పాటు చేయాల‌ని లేదా ఉన్న ట్రైబ్యున‌ల్‌కే దీనిని అప్ప‌గించాల‌ని 2014 జూలై 14న తెలంగాణ నీటిపారుద‌ల ముఖ్య కార్య‌ద‌ర్శి కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ కార్య‌ద‌ర్శ‌కి లేఖ రాశారు. అంత‌ర్ రాష్ట్ర జ‌ల‌వివాద చ‌ట్టంలోని సెక్ష‌న్ 3 ప్ర‌కారం కృష్ణా జ‌ల‌వివాదానికి సంబంధించి ఈ ఫిర్యాదు చేశారు. దీని ప్ర‌కారం ఫిర్యాదు చేసిన ఏడాదిలోగా కేంద్రం జోక్యం చేసుకుని భాగ‌స్వామ్య రాష్ట్రాల మ‌ధ్య ఓ అంగీకారానికి ప్ర‌య‌త్నించాలి. లేదా కొత్త ట్రైబ్యున‌ల్‌ను ఏర్పాటు చేయాలి. కేంద్రం ఏడాదిలోగా స్పందించ‌క పోతే ఫిర్యాదుదారుడు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంది. ఈ ఏడాది జూలై 14తో ఆ గ‌డ‌వు ముగుస్తున్నందున తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో కేంద్రం స్పందించింది. తెలంగాణ ఫిర్యాదుపై వీలైనంత త్వ‌ర‌గా అభిప్రాయం చెప్పాల‌ని ఏపీని కోరింది.

First Published:  24 Jun 2015 1:09 PM GMT
Next Story