Telugu Global
Others

ఆదాయ‌పు ప‌న్నురిట‌ర్న్స్‌ సుల‌భం

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఇప్పుడు ఎంతో సుల‌భ‌త‌రం కానుంది. అందుకు  సంబంధించి ఐటీఆర్‌-2ఏ పేరుతో స‌ర‌ళ‌త‌ర‌మైన ఫారాల‌ను ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చింది. ఈ కొత్త ఫారాల ద్వారా ప‌న్ను చెల్లింపుదారులు, ఇత‌ర సంస్థ‌లు ఆగ‌స్టు 31 వ‌ర‌కు రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌వ‌చ్చు. ఇంత‌కు ముందున్న ఫారాల్లో ఉన్న విదేశీ ప్ర‌యాణాలు, క్రియార‌హితంగా ఉన్న బ్యాంకు ఖాతాల వంటి ప‌లు అద‌న‌పు వివ‌రాలు కోర‌డంపై విమ‌ర్శ‌లు రావ‌డంతో ప్ర‌భుత్వం వాటిని ఉప‌సంహ‌రించుకుంది. ఈ కొత్త ఫారాల ద్వారా వ్యాపారం, […]

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఇప్పుడు ఎంతో సుల‌భ‌త‌రం కానుంది. అందుకు సంబంధించి ఐటీఆర్‌-2ఏ పేరుతో స‌ర‌ళ‌త‌ర‌మైన ఫారాల‌ను ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చింది. ఈ కొత్త ఫారాల ద్వారా ప‌న్ను చెల్లింపుదారులు, ఇత‌ర సంస్థ‌లు ఆగ‌స్టు 31 వ‌ర‌కు రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌వ‌చ్చు. ఇంత‌కు ముందున్న ఫారాల్లో ఉన్న విదేశీ ప్ర‌యాణాలు, క్రియార‌హితంగా ఉన్న బ్యాంకు ఖాతాల వంటి ప‌లు అద‌న‌పు వివ‌రాలు కోర‌డంపై విమ‌ర్శ‌లు రావ‌డంతో ప్ర‌భుత్వం వాటిని ఉప‌సంహ‌రించుకుంది. ఈ కొత్త ఫారాల ద్వారా వ్యాపారం, వృత్తి, మూల‌ధ‌న లాభం ద్వారా ఆదాయం లేని , విదేశీ ఆస్తులు లేని వ్య‌క్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఈ ఫారాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. పాస్‌పోర్టు సంఖ్య ఉంటే స‌మ‌ర్పించాల‌ని మాత్ర‌మే ఈ ఫారంలో ఉంది. గ‌త ఏడాదిలో క‌లిగి ఉన్న పొదుపు, క‌రెంటు ఖాతాల మొత్తం సంఖ్య‌ను మాత్ర‌మే ప్ర‌క‌టించాల్సి ఉంది. బ్యాంకు ఐఎఫ్ఎస్ కోడ్‌ను, ఆధార్ సంఖ్య‌ను పొందుప‌ర్చాల్సి ఉంటుంది. రెండు ఈమెయిల్ ఐడీలు స‌మర్పించే అవ‌కాశం ఉంది. స‌ర‌ళీక‌రించిన ఈ ఫారానికి అద‌నంగా నాలుగు పుట‌ల‌ను కూడా ఆదాయ‌పు ప‌న్ను విభాగం చేర్చింది. అద‌న‌పు వివ‌రాల‌ను పొందు ప‌ర్చాల‌నుకునేవారు ఈ నాలుగు పుట‌ల‌ను పూరించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఫారాన్ని దాఖ‌లు చేసేవారు త‌మ‌కు విదేశీ ఆస్తులుంటే, విదేశాల నుంచి ఆదాయం స‌మ‌కూరుతుంటే ఆ వివ‌రాల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.

First Published:  23 Jun 2015 1:13 PM GMT
Next Story