Telugu Global
Others

ఆరు రూపాయ‌ల‌కే దోశ ... రూ. 20 కే మ‌ట‌న్

రెండు ఇడ్లీ రూ. 25 ప‌లుకుతున్న ఈ రోజుల్లో వేడి వేడి మ‌సాలా దోశ రూ.6,  రూ. 20 ల‌కే నోరూరించే  మ‌ట‌న్ కూర ల‌భిస్తుందంటే న‌మ్ముతారా?  అందులోనూ ఇది కూలీనాలీ చేసుకునే కార్మికుల కోసం  స‌బ్సిడీతో ప్ర‌భుత్వం అందించే ప‌థ‌కం కాదు సుమా.  ప్ర‌జ‌లు ఎన్నుకున్న  ప్ర‌జాప్ర‌తినిధుల కోసం పార్లమెంటు క్యాంటీన్‌లో అమ్ముతున్న రేట్లు. మాంసం, చేప‌లు, కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్నంటుతూ సామాన్యుడికి దూరమైన ఈ రోజుల్లో స‌గ‌టున 1.4 ల‌క్ష‌ల జీతాన్ని అందుకుంటున్న ఎంపీల‌కు […]

రెండు ఇడ్లీ రూ. 25 ప‌లుకుతున్న ఈ రోజుల్లో వేడి వేడి మ‌సాలా దోశ రూ.6, రూ. 20 ల‌కే నోరూరించే మ‌ట‌న్ కూర ల‌భిస్తుందంటే న‌మ్ముతారా? అందులోనూ ఇది కూలీనాలీ చేసుకునే కార్మికుల కోసం స‌బ్సిడీతో ప్ర‌భుత్వం అందించే ప‌థ‌కం కాదు సుమా. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌జాప్ర‌తినిధుల కోసం పార్లమెంటు క్యాంటీన్‌లో అమ్ముతున్న రేట్లు. మాంసం, చేప‌లు, కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్నంటుతూ సామాన్యుడికి దూరమైన ఈ రోజుల్లో స‌గ‌టున 1.4 ల‌క్ష‌ల జీతాన్ని అందుకుంటున్న ఎంపీల‌కు ప్ర‌భుత్వం అత్యంత చ‌వ‌క‌గా ఆహారాన్ని అందిస్తోంది. అందుకోసం ఏడాదికి 60.7 కోట్ల మేర‌ స‌బ్సిడీలు భ‌రిస్తోన్న‌ట్లు స‌మాచార హ‌క్కు ద‌ర‌ఖాస్తు ద్వారా వెల్ల‌డైంది. ఈ క్యాంటీన్లో చేప‌ల వేపుడు రూ.25, మ‌ట‌న్ క‌ట్లెట్ రూ.18, మ‌ట‌న్ క‌ర్రీ రూ.20, మ‌సాల‌దోశ రూ.6ల‌కే విక్ర‌యిస్తున్నారు. ఉడికించిన కూర‌గాయ‌ల‌ను ఎంపీల‌కు 90 శాతం స‌బ్సిడితోనూ, నూనెతో చేసే కూర‌గాయ‌ల‌ను 89 శాతం స‌బ్సిడీతోనూ అమ్ముతున్నారు. మాంసాహారానికి 66 శాతం స‌బ్సిడీని ఇస్తున్నారు. పార్ల‌మెంటు క్యాంటీన్లో 76 ర‌కాల ప‌దార్ధాలు అందుబాటులో ఉండ‌గా, అవి 63 శాతం నుంచి 150 శాతం వ‌ర‌కూ స‌బ్సిడీలోనే ఎంపీల‌కు విక్ర‌యిస్తున్నారు. రొట్టెను మాత్రం కొద్దిపాటి లాభంతో అమ్ముతున్న‌ట్లు స‌హ‌కార చ‌ట్టం ద్వారా తెలిసింది.

First Published:  23 Jun 2015 1:10 PM GMT
Next Story