Telugu Global
Cinema & Entertainment

.మెగా బ్ర‌ద‌ర్స తో  చేయ‌డం నాక‌ల‌.. 

సంప‌త్ నంది.  ర‌చ్చ సినిమా వ‌ర‌కు   పెద్ద‌గా  ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని ద‌ర్శ‌కుడు.  రాంచ‌ర‌ణ్ తో చేసిన  పూర్తి స్థాయి యాక్ష‌న్  ఫిల్మ్ ర‌చ్చ  తో  ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చాడు. ఆ త‌రువాత  ప‌వ‌ర్ స్టార్ తో గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్  చేసే అవ‌కాశం వ‌చ్చింది. దాదాపు రెండు సంవ‌త్స‌రాల పాటు  గ‌బ్బ‌ర్ సింగ్  సీక్వెల్ కు   స్టోరి సిద్దం చేశాడు. అయితే   ఫైన్ గా  ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంప్రెస్ […]

.మెగా బ్ర‌ద‌ర్స తో  చేయ‌డం నాక‌ల‌.. 
X
సంప‌త్ నంది. ర‌చ్చ సినిమా వ‌ర‌కు పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని ద‌ర్శ‌కుడు. రాంచ‌ర‌ణ్ తో చేసిన పూర్తి స్థాయి యాక్ష‌న్ ఫిల్మ్ ర‌చ్చ తో ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చాడు. ఆ త‌రువాత ప‌వ‌ర్ స్టార్ తో గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. దాదాపు రెండు సంవ‌త్స‌రాల పాటు గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్ కు స్టోరి సిద్దం చేశాడు. అయితే ఫైన్ గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంప్రెస్ కాక పోవ‌డంతో ఆ ప్రాజెక్ట్ చే జారిపోయింది. అయిన‌ప్ప‌టికి సంప‌త్ నంది నిరాశ చెంద‌కుండ వెంట‌నే అదే క‌థ‌తో బెంగాల్ టైగ‌ర్ అంటూ ర‌వితేజ తో చేస్తున్నాడు. ఈ రోజు త‌న బ‌ర్త్ డే. బెంగాల్ టైగ‌ర్ చిత్ర షూటింగ్ లోకేష‌న్ లోనే సంప‌త్ నంది బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులో మాట వ్య‌క్త ప‌రిచాడు. కెరీర్ ప‌రంగా త‌ను ఎంతో సంతృప్తిగా ఉన్న‌ట్లు తెలిపారు. ఎప్ప‌టికైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తోను.. చిరంజీవి తో సినిమా చేయ‌డ‌మే త‌న జీవిత ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. ఆయ‌న డ్రీమ్ నిజం కావాల‌ని కోరుకుందాం.
First Published:  21 Jun 2015 12:12 AM GMT
Next Story