Telugu Global
Others

నారాయ‌ణ కాలేజీలో ఘ‌ర్ష‌ణ: 31 మందికి గాయాలు

విశాఖ‌ప‌ట్నంలోని నారాయ‌ణ కాలేజీ లో స్నానాలు చేసే స‌మ‌యంలో నీటి కోసం ఏర్ప‌డిన వివాదం చినికి చినికి గాలివాన‌లా మారి 31 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉత్త‌రాది ప్రాంతానికి చెందిన విద్యార్థుల మ‌ధ్య ఈ వివాదం చోటు చేసుకుంది. విశాఖ‌ప‌ట్నంలోని మ‌ధుర‌వాడ మిథులాపురి కాల‌నీలోని నారాయ‌ణ క్యాంప‌స్‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున స్నానాలు చేసే స‌మ‌యంలో ఈ ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు విద్యార్థులు ఎదుటి వ‌ర్గంపై […]

నారాయ‌ణ కాలేజీలో ఘ‌ర్ష‌ణ: 31 మందికి గాయాలు
X
విశాఖ‌ప‌ట్నంలోని నారాయ‌ణ కాలేజీ లో స్నానాలు చేసే స‌మ‌యంలో నీటి కోసం ఏర్ప‌డిన వివాదం చినికి చినికి గాలివాన‌లా మారి 31 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉత్త‌రాది ప్రాంతానికి చెందిన విద్యార్థుల మ‌ధ్య ఈ వివాదం చోటు చేసుకుంది. విశాఖ‌ప‌ట్నంలోని మ‌ధుర‌వాడ మిథులాపురి కాల‌నీలోని నారాయ‌ణ క్యాంప‌స్‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున స్నానాలు చేసే స‌మ‌యంలో ఈ ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు విద్యార్థులు ఎదుటి వ‌ర్గంపై చైన్ల‌తో దాడికి దిగారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో 31 మంది గాయ‌ప‌డ‌గా వీరంద‌రినీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో 26 మందికి చికిత్స చేసి పంపించి వేశారు. మ‌రో ఐదుగురి ప‌రిస్థితి కొంత ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌డంతో ఆస్ప‌త్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు. విద్యార్థల ఘర్షణకు సంబంధించి కాలేజీ యాజమాన్యం సమాచారం అందించడంతో పోలీసులు వ‌చ్చి విచార‌ణ జ‌రిపారు. కొందరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ చేసి మ‌ళ్ళీ ఇలాంటి ప‌నుల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని మంద‌లించి పంపించి వేశారు. కేసులు పెట్ట‌డం వ‌ల్ల వారి భ‌విష్య‌త్ దెబ్బ‌తింటుంద‌న్న కార‌ణంతో కౌన్సిలింగ్‌కే ప‌రిమితం చేసి వ‌దిలి వేశారు. నీటి వివాదంపై గత రాత్రి ఏడు గంటల ప్రాంతంలోనూ ఘర్షణ జరిగిందని, కాలేజీ యాజమాన్యం అక్క‌డే ఉండటంతో గొడవ సద్దు మణిగిందని డీసీపీ త్రివిక్రమ్‌ వర్మ తెలిపారు. రెండోసారి తెల్లవారుజామున గొడవ జరిగిన సమయంలో కాలేజీకి సంబంధించి ప్ర‌తినిధులెవ‌రూ అక్క‌డ‌ లేకపోవడంతో తీవ్రంగా కొట్టుకున్నారని ఆయన చెప్పారు.
First Published:  20 Jun 2015 1:25 AM GMT
Next Story