Telugu Global
Cinema & Entertainment

టై‍ంపాస్ రొమాన్స్ లో తప్పేంటి.. కంగనా

 “తనూ వెడ్స్ మనూ” చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ  కంగనా రనౌత్ నటనకు కితాబివ్వటంతో అమ్మడు అస్సలు నేల మీద నడ‌వటమే మరచిపోయిందంటున్నారు బీ టౌన్ వాసులు. అపూడెప్పుడో ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన ఈ అమ్మడు టాలీవుడ్ లో అంతగా ఆఫర్స్ సాధించలేకపోయింది. అయితే అమితాబ్ కామెంట్స్ తో ఇప్పుడు ఈ అమ్మడు అందరికి ఉచిత సలహాలు ఇచేస్తుందా లేక తన సినిమా ప్రమోషన్ కోసం మాట్లాడుతుందా అనే సందేహం కలుగుతుంది..బాలీవుడ్ సినిమా […]

టై‍ంపాస్ రొమాన్స్ లో తప్పేంటి.. కంగనా
X
“తనూ వెడ్స్ మనూ” చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ కంగనా రనౌత్ నటనకు కితాబివ్వటంతో అమ్మడు అస్సలు నేల మీద నడ‌వటమే మరచిపోయిందంటున్నారు బీ టౌన్ వాసులు. అపూడెప్పుడో ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన ఈ అమ్మడు టాలీవుడ్ లో అంతగా ఆఫర్స్ సాధించలేకపోయింది. అయితే అమితాబ్ కామెంట్స్ తో ఇప్పుడు ఈ అమ్మడు అందరికి ఉచిత సలహాలు ఇచేస్తుందా లేక తన సినిమా ప్రమోషన్ కోసం మాట్లాడుతుందా అనే సందేహం కలుగుతుంది..బాలీవుడ్ సినిమా “కట్టీ బట్టీ:” ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆమె సహజీవనంపై మాట్లాడుతూ అది ఇద్దరి మధ్య‌ అర్ధవంతమైనదై ఉండాలని చెప్పింది. అంతే కాకుండా టైంపాస్ రొమాన్స్ లో తప్పేమిలేదని సెలవిచ్చింది. అయితే ఈ విషయం ఇప్పుడు తను నటిస్తున్న నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో “పాయల్” అనే పాత్రకు సంబంధించి అయుండవచ్చని విశ్లేషకులంటున్నారు..
First Published:  17 Jun 2015 12:18 AM GMT
Next Story