Telugu Global
Others

చెత్త తీసుకెళ్లేవారికీ ఓ అవార్డు!

ఇంట్లో రోజువారీ పనుల్లో భాగంగా ఎంతో చెత్త పేరుకుపోతుంది. దాన్నంతా తీసుకెళ్లి బయట చెత్తకుండీల్లో పడేస్తాం! ఒక్క రోజు.. చెత్త తీసుకెళ్లే వాళ్లు రాలేదంటే మాత్రం రచ్చరచ్చే! చుట్టుపక్కల వాళ్లకు ముక్కుపుటాలదిరిపోయే కంపు తప్పదు!! ఇటీవల మునిసిపల్‌ కార్మికుల సమ్మె అలాంటి అనుభవాన్నే నగరవాసులకు మిగిల్చింది. వాళ్లు లేకపోతే ఆరోగ్యం లేదు అనుకున్నారేమో.. చెత్త తీసుకెళ్లేవాళ్లకూ ఓ అవార్డు ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసింది కేంద్రం. ఆ ఆలోచనే ఆయుధంగా వచ్చే ఏడాది నుంచి అవార్డును […]

చెత్త తీసుకెళ్లేవారికీ ఓ అవార్డు!
X
ఇంట్లో రోజువారీ పనుల్లో భాగంగా ఎంతో చెత్త పేరుకుపోతుంది. దాన్నంతా తీసుకెళ్లి బయట చెత్తకుండీల్లో పడేస్తాం! ఒక్క రోజు.. చెత్త తీసుకెళ్లే వాళ్లు రాలేదంటే మాత్రం రచ్చరచ్చే! చుట్టుపక్కల వాళ్లకు ముక్కుపుటాలదిరిపోయే కంపు తప్పదు!! ఇటీవల మునిసిపల్‌ కార్మికుల సమ్మె అలాంటి అనుభవాన్నే నగరవాసులకు మిగిల్చింది. వాళ్లు లేకపోతే ఆరోగ్యం లేదు అనుకున్నారేమో.. చెత్త తీసుకెళ్లేవాళ్లకూ ఓ అవార్డు ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసింది కేంద్రం. ఆ ఆలోచనే ఆయుధంగా వచ్చే ఏడాది నుంచి అవార్డును ప్రదానం చేస్తామని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ప్రకించారు. ‘చెత్తను తీసుకెళ్లడం అనధికార పనే కావొచ్చు.. కానీ, అదో ముఖ్యమైన రంగం. నగర ప్రజలు వేసే చెత్తను తీసుకెళ్లేవారు రోజంతా ఎంతో శ్రమించి దాన్ని రీసైకిల్‌ చేస్తుంటారు. అందుకే వాళ్ల కష్టాన్ని గుర్తించి వారికి ఈ అవార్డును ఇవ్వాలని నిర్ణయించాం’’ అని జవదేకర్‌ చెప్పారు.
First Published:  11 Jun 2015 1:05 PM GMT
Next Story