Telugu Global
Cinema & Entertainment

మీ రవితేజ కిక్ మాకు ఒద్దంటున్న బాలివుడ్?

మాస్ మహారాజ రవితేజ ‘కిక్’ తెలుగులో ఎంత బ్లాక్‌బస్టర్ హిట్టో, సల్మాన్ ఖాన్‌తో దాని హిందీ రీమేక్ కుడా బాలివుడ్‌లో అంతే పెద్ద హిట్. నిజం చెప్పాల్సి వస్తే, సల్మాన్‌కి రికార్డుల పంట పండించింది హిందీ ‘కిక్’. మరి మన తెలుగులో ‘కిక్ 2’ రెడీగా ఉంది రిలీజ్‌కి. ఆ మధ్య ‘కిక్ 2’ రీమేక్ కోసం మన తెలుగు మేకర్స్ ని వారు సంప్రదించారని, కాని ‘కిక్’ విషయంలో జరిగిన మార్పులు నచ్చకపోవడం వలన, మన […]

మీ రవితేజ కిక్ మాకు ఒద్దంటున్న బాలివుడ్?
X

మాస్ మహారాజ రవితేజ ‘కిక్’ తెలుగులో ఎంత బ్లాక్‌బస్టర్ హిట్టో, సల్మాన్ ఖాన్‌తో దాని హిందీ రీమేక్ కుడా బాలివుడ్‌లో అంతే పెద్ద హిట్. నిజం చెప్పాల్సి వస్తే, సల్మాన్‌కి రికార్డుల పంట పండించింది హిందీ ‘కిక్’. మరి మన తెలుగులో ‘కిక్ 2’ రెడీగా ఉంది రిలీజ్‌కి. ఆ మధ్య ‘కిక్ 2’ రీమేక్ కోసం మన తెలుగు మేకర్స్ ని వారు సంప్రదించారని, కాని ‘కిక్’ విషయంలో జరిగిన మార్పులు నచ్చకపోవడం వలన, మన ప్రొడ్యూసర్స్ కొన్ని కండీషన్స్ పెట్టారని, చివరికి డీల్ కుదరలేదనే వార్తలు మాత్రం చలామణి అయ్యాయి.

ఇప్పుడు లేటెస్ట్‌గా అందుతున్న సమాచారం ప్రకారం బాలివుడ్ ఫిల్మ్ మేకర్ సాజిద్ నాడియడ్‌వాలా ‘కిక్ 2’ రిలీజ్ డేట్‌ని అన్నౌన్స్ చేసేసాడు. 2017 ‘ఈద్ ‘ పండుగ నాటికి ‘కిక్ 2’ రిలీజ్ ఉంటుందని ప్రకటన వచ్చింది. మరి ‘కిక్ 2’ స్టోరీ సంగతి ఏమిటి? ఈ సారి ఫ్రెష్ కథనే వాళ్ళు తీసుకోబోతున్నారు. ఇందుకు స్వయంగా సల్మాన్ ఖాన్ స్టోరీ & స్క్రిప్ట్ తయారు చేస్తాడట. ఇందుకోసమే 2 సంవత్సరాల కాలం పడుతుందట. కిక్ సీక్వెల్‌లో తారాగణం కూడా రిపీట్ చేయకుండా…హీరోయిన్‌తో సహా కొత్త యూనిట్ తీసుకోబోతున్నారని సమాచారం. మన ‘కిక్ 2’ హిట్ అయితే కూడా ఇదే మాట మీద ఉంటారో వేచి చూడాల్సిందే.

First Published:  10 Jun 2015 1:36 AM GMT
Next Story