Telugu Global
Others

మూసీ ప్రక్షాళన నా ల‌క్ష్యం: దత్తాత్రేయ

హైదరాబాద్‌ వాసినైన తాను ఇక్కడున్న మూసీ నది ప్రక్షాళనకు కంకణం కట్టుకున్నానని, అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడి అధిక నిధులను వెచ్చించేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండారు ద‌త్తాత్రేయ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో స్వయంగా సమావేశమై మూసీలో ఉన్న అక్రమణలు తొలగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానని ఆయ‌న చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయ‌న  దేశంలో బీజేపీ ప్రభుత్వం గంగా నది ప్రక్షాళనకు 20 వేల కోట్లను […]

హైదరాబాద్‌ వాసినైన తాను ఇక్కడున్న మూసీ నది ప్రక్షాళనకు కంకణం కట్టుకున్నానని, అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడి అధిక నిధులను వెచ్చించేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండారు ద‌త్తాత్రేయ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో స్వయంగా సమావేశమై మూసీలో ఉన్న అక్రమణలు తొలగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానని ఆయ‌న చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయ‌న దేశంలో బీజేపీ ప్రభుత్వం గంగా నది ప్రక్షాళనకు 20 వేల కోట్లను ఖర్చు చేస్తోందన్నారు.కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణకు హరిత హారం పేరుతో రూపొందించిన వెబ్‌సైట్‌ను కేంద్ర మంత్రి ప్రారంభించారు.
First Published:  5 Jun 2015 1:20 PM GMT
Next Story