Telugu Global
Others

డ్వాక్రా రుణమాఫీకి రూ.3,528 కోట్లు: మంత్రి పల్లె

డ్వాక్రా రుణమాఫీకి రూ.3,528 కోట్లు కేటాయించినట్టు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు పల్లె చెప్పారు. ఆస్తులు సరిగా పంచాలని, గవర్నర్‌ అధికారాలు సరి చేయాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 3 నుంచి 7 లోగా 30 శాతం మాఫీ సొమ్ము ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని, రేపు ఉదయం 9 గంటలకు నవ నిర్మాణ దీక్ష ఉంటుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా […]

డ్వాక్రా రుణమాఫీకి రూ.3,528 కోట్లు: మంత్రి పల్లె
X
డ్వాక్రా రుణమాఫీకి రూ.3,528 కోట్లు కేటాయించినట్టు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు పల్లె చెప్పారు. ఆస్తులు సరిగా పంచాలని, గవర్నర్‌ అధికారాలు సరి చేయాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 3 నుంచి 7 లోగా 30 శాతం మాఫీ సొమ్ము ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని, రేపు ఉదయం 9 గంటలకు నవ నిర్మాణ దీక్ష ఉంటుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి దీక్షలు చేపట్టాలని కార్యకర్తలకు పల్లె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా నవ్యాంధ్ర నిర్మాణానికి సహకరిస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తామన్నారు. అయితే, ఈ దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు.
First Published:  1 Jun 2015 1:06 PM GMT
Next Story