Telugu Global
Others

ఎమ్మెల్సీల ఎన్నిక... అనుకున్న‌ట్టే జ‌రిగింది...టీడీపీ ఓడింది

తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఐదుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. శాసన మండలిలోని ఆరు ఖాళీ స్థానాలకు సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో.. టీఆర్ఎస్ ఐదు స్థానాలను, కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఓడిపోయారు. ఈ ఎన్నికలో ఐదు చెల్లని ఓట్లు పడ్డాయి. ఇవిగాక మరొకటి నోటా ఓటు. ఈ ఆరు ఓట్లూ తెలుగుదేశం, బిజెపి కూటమి ఓట్లేనని భావిస్తున్నారు. ఎంతో ఉత్కంఠగా […]

ఎమ్మెల్సీల ఎన్నిక... అనుకున్న‌ట్టే జ‌రిగింది...టీడీపీ ఓడింది
X

తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఐదుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. శాసన మండలిలోని ఆరు ఖాళీ స్థానాలకు సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో.. టీఆర్ఎస్ ఐదు స్థానాలను, కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఓడిపోయారు. ఈ ఎన్నికలో ఐదు చెల్లని ఓట్లు పడ్డాయి. ఇవిగాక మరొకటి నోటా ఓటు. ఈ ఆరు ఓట్లూ తెలుగుదేశం, బిజెపి కూటమి ఓట్లేనని భావిస్తున్నారు. ఎంతో ఉత్కంఠగా మారిన ఈ ఎన్నికలో ఆరు ఓట్లు చెల్లకపోవడంతో తెలుగుదేశం పార్టీకి రావలసిన ఓట్లు కూడా రాలేదని అర్థమవుతున్నది. సోమవారం జరిగిన ఎన్నికలో మొత్తం 118 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వామపక్ష సభ్యులు మాత్రం ఈ ఎన్నికలో పాల్గొనలేదు. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు కూడా తమ అభ్యర్థి గెలుపొందకపోతారా అని ఎదురు చూడగా, వారికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ నుంచి మొత్తం 18 ఓట్లు ఆకుల లలితకే పడ్డాయి. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీకి నలుగురు అభ్యర్థులను మాత్రమే గెలిపించుకునేందుకు తగినంత బలం ఉంది. కానీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఎలాగైనా ఐదుగురినీ గెలిపించాల్సిందేనని, లేకపోతే అసెంబ్లీని సైతం రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్తానని కూడా పార్టీ అంతర్గత సమావేశాల్లో హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈలోపు నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేసేందుకు వెళ్లిన టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికిపోవడం లాంటి సంచలన విశేషాలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానే జరిగాయి. కొత్తగా కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, బి.వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్‌, కె.యాదవ్రెడ్డి (టీఆర్‌ఎస్), ఆకుల లలిత (కాంగ్రెస్) ఎమ్మెల్సీలుగా ఎన్నిక‌య్యారు.

First Published:  1 Jun 2015 12:05 PM GMT
Next Story