Telugu Global
Others

అమెరికాలో జూన్‌ 21న యోగాథాన్‌

వాషింగ్టన్‌, మే 29: అంతర్జాతీయ యోగా డే (జూన్‌ 21) రోజు అమెరికాలోని వందకుపైగా సిటీల్లో యోగాథాన్‌ నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవర్సీస్‌ వాలంటీర్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా (ఓవీబీఐ) ఆధ్వర్యంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, నేపాలీ స్టూడెండ్‌ ఆర్గనైజేషన్‌తోపాటు దాదాపు 50 యోగా, ఆధ్యాత్మిక సంఘాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. అమెరికా వ్యాప్తంగా యోగాపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న ఈ యోగాథాన్‌కు డల్లాస్‌కు చెందిన సన్‌స్టోన్‌ యోగా అనే సంస్థ ఆర్థిక సహకారం అందిస్తోంది. […]

అమెరికాలో జూన్‌ 21న యోగాథాన్‌
X
వాషింగ్టన్‌, మే 29: అంతర్జాతీయ యోగా డే (జూన్‌ 21) రోజు అమెరికాలోని వందకుపైగా సిటీల్లో యోగాథాన్‌ నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవర్సీస్‌ వాలంటీర్‌ ఫర్‌ బెటర్‌ ఇండియా (ఓవీబీఐ) ఆధ్వర్యంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, నేపాలీ స్టూడెండ్‌ ఆర్గనైజేషన్‌తోపాటు దాదాపు 50 యోగా, ఆధ్యాత్మిక సంఘాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. అమెరికా వ్యాప్తంగా యోగాపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న ఈ యోగాథాన్‌కు డల్లాస్‌కు చెందిన సన్‌స్టోన్‌ యోగా అనే సంస్థ ఆర్థిక సహకారం అందిస్తోంది. వివిధ సంస్థలు, సంఘాలతోపాటు.. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌, ఎయిర్‌ ఇండియా, సబ్‌వే సంస్థలు కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నాయి.
First Published:  29 May 2015 1:15 PM GMT
Next Story