Telugu Global
Others

చేపల పెంపకం దార్లకు ఏపీ సర్కార్ వరాలు

చేపలు, రొయ్యల పెంపకం దార్లపై ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా వరాలు కురిపించింది. చెరువుల విషయంలో ‘తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత’ అని చెప్పేసింది. గ్రామాల్లోనూ, మునిసిపాలిటీల్లోనూ చేపలు పెంచాలన్న ఆసక్తి ఉన్న వారు తమ పేరు మీద ఉన్న భూమిలో లేదా లీజుకు తీసుకుని కూడా చేపల పెంపకాన్ని చేపట్టవచ్చు. శ్మశానానికి స‌మీపంలో కూడా చేపల చెరువులు ఏర్పాటు చేసుకోవచ్చని ఈ ఉత్తుర్వుల్లో పేర్కొంది. గ్రామానికి, శ్మశానానికి కనీసం పది మీటర్ల దూరం ఉండాల‌న్న‌ నిబంధనను సడలించింది. తాజా ఉత్తర్వుల […]

చేపలు, రొయ్యల పెంపకం దార్లపై ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా వరాలు కురిపించింది. చెరువుల విషయంలో ‘తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత’ అని చెప్పేసింది. గ్రామాల్లోనూ, మునిసిపాలిటీల్లోనూ చేపలు పెంచాలన్న ఆసక్తి ఉన్న వారు తమ పేరు మీద ఉన్న భూమిలో లేదా లీజుకు తీసుకుని కూడా చేపల పెంపకాన్ని చేపట్టవచ్చు. శ్మశానానికి స‌మీపంలో కూడా చేపల చెరువులు ఏర్పాటు చేసుకోవచ్చని ఈ ఉత్తుర్వుల్లో పేర్కొంది. గ్రామానికి, శ్మశానానికి కనీసం పది మీటర్ల దూరం ఉండాల‌న్న‌ నిబంధనను సడలించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం కేవలం మూడు మీటర్ల దూరం ఉంటే చాలు. దీనికి రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులూ అవసరం లేదు. తొలుత జిల్లా మత్స్యశాఖాధికారి ఆధ్వర్యంలోని కమిటీ వద్ద రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి. చేపల చెరువులకు వినియోగించే మందులు, రసాయనాలు, అందులోని చేప పిల్లలు, వాటికి ఆహారం వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా మత్స్యశాఖాధికారికి తెలియజేయాలన్న నిబంధనలోనూ మార్పు చేశారు. చేపల పెంపకంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మత్స్యశాఖ కమిషనర్‌ను ఆశ్రయించే అవకాశం కల్పించారు. అనధికారిక చెరువులను సైతం జిల్లా కమిటీకి ఫీజు, పెనాల్టీ చెల్లించి రిజిస్ర్టేషన్‌ చేయించుకునే వెసులుబాటు కల్పించారు.
First Published:  26 May 2015 1:16 PM GMT
Next Story