Telugu Global
Cinema & Entertainment

చెల్లెలి కోసం డాన్స్ చేసిన సల్మాన్

తన చెల్లెలు అర్పిత రిసెప్షన్ లో భాగంగా సల్మాన్ ఖాన్ డాన్స్ చేసి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు. ఏకంగా 4 గంటల పాటు స్టేజ్ పైనే గడిపాడు సల్మాన్. ఈమధ్యే సల్మాన్ చెల్లెలి పెళ్లి జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి ప్రాంతానికి చెందిన ఆయుష్ కు అర్పితను ఇచ్చి పెళ్లిచేశారు. హిమాచల్ ప్రదేశ్ మంత్రి అనిల్ శర్మ కొడుకే ఆయుష్. అంతేకాదు.. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ పొలిటీషియన్ సుఖ్ రామ్ కు స్వయానా మనవడు. […]

చెల్లెలి కోసం డాన్స్ చేసిన సల్మాన్
X
తన చెల్లెలు అర్పిత రిసెప్షన్ లో భాగంగా సల్మాన్ ఖాన్ డాన్స్ చేసి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు. ఏకంగా 4 గంటల పాటు స్టేజ్ పైనే గడిపాడు సల్మాన్. ఈమధ్యే సల్మాన్ చెల్లెలి పెళ్లి జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి ప్రాంతానికి చెందిన ఆయుష్ కు అర్పితను ఇచ్చి పెళ్లిచేశారు. హిమాచల్ ప్రదేశ్ మంత్రి అనిల్ శర్మ కొడుకే ఆయుష్. అంతేకాదు.. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ పొలిటీషియన్ సుఖ్ రామ్ కు స్వయానా మనవడు.

ఇలాంటి కుటుంబంలోకి తన చెల్లెలిని కోడలిగా పంపించడం చాలా ఆనందంగా ఉందన్నాడు సల్మాన్. అందుకే ఆ ఆనందాన్ని డాన్స్ రూపంలో చూపించాడు. మండిలో జరిగిన ఈ వేడుకకు దాదాపు 10వేల మంది బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. తనకు తెలిసిన వాళ్లందర్నీ సల్మాన్ స్వయంగా పలకరించాడు. అయితే ఈ ఫంక్షన్ కు బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ రాలేదు. వాళ్లంతా ముంబయిలో జరిగిన పెళ్లికి హాజరవ్వడంతో మండికి రాలేదు. సల్మాన్ తో పాటు అతడి తమ్ముడు సోహైల్ ఖాన్ మండి వెళ్లి చెల్లెల్ని అత్తవారింట దిగబెట్టి వచ్చారు.

First Published:  26 May 2015 12:59 AM GMT
Next Story