Telugu Global
Cinema & Entertainment

గబ్బర్ సింగ్-2 కు రంగం సిద్ధం

గబ్బర్ సింగ్-2 ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను ఈనెల 29 నుంచి ప్రారంభించాలనుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే లొకేషన్ వేట కూడా పూర్తిచేశారు. దర్శకుడు బాబి, సినిమాటోగ్రాఫర్ అజయ్ విన్సెంట్ కలిసి మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్ని పరిశీలించి, అందులోంచి కొన్నింటిని ఎంపిక చేశారు.ఎంపిక చేసిన ఆ ప్రాంతంలో 29 నుంచి గబ్బర్ సింగ్-2 షూటింగ్ మొదలవుతుంది. తాజా సమాచారం ప్రకారం పవన్ ఇప్పటికే పూణె చేరుకున్నాడు. ఈ 4 రోజులు అక్కడే […]

గబ్బర్ సింగ్-2 కు రంగం సిద్ధం
X
గబ్బర్ సింగ్-2 ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను ఈనెల 29 నుంచి ప్రారంభించాలనుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే లొకేషన్ వేట కూడా పూర్తిచేశారు. దర్శకుడు బాబి, సినిమాటోగ్రాఫర్ అజయ్ విన్సెంట్ కలిసి మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్ని పరిశీలించి, అందులోంచి కొన్నింటిని ఎంపిక చేశారు.ఎంపిక చేసిన ఆ ప్రాంతంలో 29 నుంచి గబ్బర్ సింగ్-2 షూటింగ్ మొదలవుతుంది. తాజా సమాచారం ప్రకారం పవన్ ఇప్పటికే పూణె చేరుకున్నాడు. ఈ 4 రోజులు అక్కడే రెస్ట్ తీసుకొని, అట్నుంచి అటు షూటింగ్ లొకేషన్ కు వెళ్లిపోతాడు. మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలో ఈ షూట్ ఉంటుంది. మొదటగా పవన్ ఇంట్రడక్షన్ సాంగ్ ను అక్కడ తీసే ఆలోచనలో ఉన్నారు. ఈ షూటింగ్ లో హీరోయిన్ అనీష ఆంబ్రోస్ పాల్గొనబోదు. యూనిట్ తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత హీరోయిన్ తో షూటింగ్ షురు అవుతుంది.

First Published:  24 May 2015 11:56 PM GMT
Next Story