Telugu Global
Cinema & Entertainment

తమిళ్ లోనూ "బాలయ్య" విలన్ హవా..   

చాలా కాలం రొమాంటిక్ హీరో గా గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత ఇగోని పక్కన పెట్టేసి విలన్ క్యారక్టర్ లకి పచ్చ జండా ఊపేస్తున్నాడు హీరో జగపతి బాబు. బాలకృష్ణ లెజెండ్ సినిమా తో విలన్ గా రీఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు కరెంటు తీగ, పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలలో కూడా అందరిని ఆకట్టుకున్నారు. ఇక రజనికాంత్ లింగా సినిమాలోనటించి, తమిళ్ ప్రేక్షకులకు కూడా దగ్గర అయ్యాడు.  దగ్గర అవడమే కాదు, చిన్న సినిమాల […]

తమిళ్ లోనూ బాలయ్య విలన్ హవా..   
X
చాలా కాలం రొమాంటిక్ హీరో గా గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత ఇగోని పక్కన పెట్టేసి విలన్ క్యారక్టర్ లకి పచ్చ జండా ఊపేస్తున్నాడు హీరో జగపతి బాబు. బాలకృష్ణ లెజెండ్ సినిమా తో విలన్ గా రీఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు కరెంటు తీగ, పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలలో కూడా అందరిని ఆకట్టుకున్నారు. ఇక రజనికాంత్ లింగా సినిమాలోనటించి, తమిళ్ ప్రేక్షకులకు కూడా దగ్గర అయ్యాడు.
దగ్గర అవడమే కాదు, చిన్న సినిమాల మార్కెట్ కి కూడా జగపతి’ని బాగా వాడుకుంటున్నారు అట. తెలుగు నుండి డబ్ అయిన కొన్ని సినిమాలకు, ‘లింగా సినిమా విలన్ ‘ అంటూ ప్రచారం చేసేసుకుంటున్నారు. ఏదైనా సూపర్ స్టార్ తో కలిసి నటిస్తే అది ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుందో అర్థం అయ్యే ఉంటుంది అటు తమిళం ఇటు తెలుగు దర్శక నిర్మాతలకి. ఇది ఇలాగే ఉంటే విలన్ గా జగపతి బాబు హవా మరి కొంత కాలం నడిచినట్లే..!
First Published:  23 May 2015 12:41 AM GMT
Next Story