Telugu Global
NEWS

హైద‌రాబాద్‌లో వై-ఫై సేవలపై రగడ!

హైద‌రాబాద్‌ మొత్తం వై-ఫైగా చేసేస్తామంటూ జీహెచ్‌ఎంసీ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు తెలంగాణ‌ ప్రభుత్వంలోని ఐటీ, కమ్యూనికేషన్ల విభాగానికి తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. నగరంలోని 200 ప్రాంతాల్లో వై-ఫై సదుపాయాన్ని కల్పిస్తామని జీహెచ్‌ఎంసీ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ఐటీకి మంట పుట్టిస్తున్నాయి. త‌మ‌కు సంబంధం లేని విష‌యాల్లో జీహెచ్ఎంసీ జోక్యాన్ని విమ‌ర్శించింది. వాస్తవానికి ఈ విషయంలో కార్పొరేషన్‌కు ఎలాంటి పాత్ర ఉండబోదని, జీహ‌చ్ఎంసీని కంట్ర‌లో చేయాల్సిందిగా సంబంధిత శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరాల‌ని ఐటీ అండ్‌ సీ విభాగం అధికారులు […]

హైద‌రాబాద్‌ మొత్తం వై-ఫైగా చేసేస్తామంటూ జీహెచ్‌ఎంసీ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు తెలంగాణ‌ ప్రభుత్వంలోని ఐటీ, కమ్యూనికేషన్ల విభాగానికి తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. నగరంలోని 200 ప్రాంతాల్లో వై-ఫై సదుపాయాన్ని కల్పిస్తామని జీహెచ్‌ఎంసీ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ఐటీకి మంట పుట్టిస్తున్నాయి. త‌మ‌కు సంబంధం లేని విష‌యాల్లో జీహెచ్ఎంసీ జోక్యాన్ని విమ‌ర్శించింది. వాస్తవానికి ఈ విషయంలో కార్పొరేషన్‌కు ఎలాంటి పాత్ర ఉండబోదని, జీహ‌చ్ఎంసీని కంట్ర‌లో చేయాల్సిందిగా సంబంధిత శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరాల‌ని ఐటీ అండ్‌ సీ విభాగం అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. నగరంలోని నెక్లెస్‌ రోడ్డు, పీపుల్స్‌ ప్లాజా, సచివాలయం ప్రాంతాల్లో వై-ఫై సేవలు అందించేందుకు ఐటీ శాఖ బీఎస్‌ఎన్‌ఎల్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. పైలట్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌ 3న ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో భాగంగా 32 ఎంబీపీఎస్‌ వేగంతో ఈ ప్రాంతంలో 19 చోట్ల హాట్‌స్పాట్లు ఏర్పాటు చేస్తారు. నెటిజన్లు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అక్కడ అరగంట పాటు బ్రౌజ్‌ చేసుకోవచ్చు. 30 నిమిషాలు దాటిన తర్వాత మాత్రం ఎలాంటి చార్జీలు వర్తిస్తాయో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంకా చెప్పాల్సి ఉంది. త్వర లోనే దీన్ని శంషాబాద్‌ విమానాశ్రయం, ఇతర ప్రాంతాలకూ విస్తరించాలని చూస్తున్నారు.-పీఆర్‌
First Published:  6 April 2015 4:31 AM GMT
Next Story